ట్రిపుల్​ ఐటీలో కౌన్సెలింగ్ ప్రారంభం

బాసర, వెలుగు : రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం( ఆర్జీయూకేటీ) బాసరలో  పీయూసీ ప్రవేశాలకు కౌన్సెలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. అకాడమిక్ బ్లాక్ లో విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. 459 మంది హాజరు కాగా 41 మంది గైర్హాజరయ్యారు. మొదటి రోజు 1 నుంచి 500 ర్యాంక్​వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. శనివారం 501 నుంచి 1000 వరకు, ఆదివారం 1001 నుంచి 1404  వరకు సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. 

ఫస్ట్​ అడ్మిషన్​ను బాసర గ్రామానికి చెందిన నానెం నవ్యకు డైరెక్టర్ ప్రొఫెసర్ సతీశ్ కుమార్ అందజేశారు. విద్యార్థులు ఈనెల 24న క్యాంపస్ లో రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. ఆగస్టు 1 నుంచి అకాడమిక్ ఇయర్ ప్రారంభమవుతుందని, వీరి కోసం వారం పాటు అవగాహన సదస్సులను నిర్వహిస్తామని  డైరెక్టర్​ ప్రొఫెసర్​ సతీశ్​ తెలిపారు. కో ఆర్డినేటర్లు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ పావని, డాక్టర్ దత్తు, సభ్యులు డాక్టర్ కుమార్ రాగుల, శ్రీకాంత్, అడ్మిషన్స్ కమిటీ సభ్యులు హరికృష్ణ, సునీత, కృష్ణ, సంతోష్​రెడ్డి, పాల్గొన్నారు.