
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ(హైదరాబాద్), శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ (ములుగు, సిద్దిపేట జిల్లా)లో 2022–-23 విద్యా సంవత్సరానికి సెల్ఫ్‌ఫైనాన్స్ విభాగం కింద వ్యవసాయ బీఎస్సీ డిగ్రీలో అడ్మిషన్స్‌కు కౌన్సెలింగ్ నిర్వహిస్తోంది. ఈ కోర్సులకు ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న ఎంసెట్ ర్యాంకర్లు డిసెంబర్ 28, 29 తేదీల్లో వర్సిటీలో జరిగే ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని జయశంకర్ వర్సిటీ సూచించింది. ఈడబ్ల్యుఎస్ రిజర్వుడ్ కేటగిరీ తప్ప మిగిలిన కోటాల విద్యార్థులందరూ ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులని స్పష్టంచేసింది. ఏజీ బీఎస్సీ కోర్సులో 154, బీఎస్సీ (కమ్యూనిటీ సైన్స్)లో 10, హార్టికల్చర్ బీఎస్సీలో 40 సీట్లు ఉన్నాయి.
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ రాష్ట్ర ఎంసెట్-2022 ర్యాంకు సాధించి ఉండాలి. కౌన్సెలింగ్ షెడ్యూల్: డిసెంబర్ 28, 29 తేదీల్లో ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు యూనివర్సిటీ ఆడిటోరియం, పీజేటీఎస్‌ఏయూ, రాజేంద్రనగర్, హైదరాబాద్‌లో కౌన్సెలింగ్ ఉంటుంది. వివరాలకు www.pjtsau.edu.in వెబ్సైట్ సంప్రదించాలి.