అందుబాటులో 7,835 బీఫార్మసీ సీట్లు.. అక్టోబర్ 19 నుంచి అడ్మిషన్ కౌన్సెలింగ్

అందుబాటులో 7,835 బీఫార్మసీ సీట్లు.. అక్టోబర్ 19 నుంచి అడ్మిషన్ కౌన్సెలింగ్

హైదరాబాద్, వెలుగు: బీఫార్మసీ, ఫార్మాడీ తదితర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం అందుబాటులోని సీట్ల వివరాలను విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. 121 కాలేజీల్లో 7,835 బీఫార్మసీ సీట్లున్నాయి. వాటిలో ప్రైవేటులోనే 113 కాలేజీలుండగా 7,351 సీట్లు అందుబాటులో ఉన్నట్టు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన వెల్లడించారు. ఒక సర్కారు  కాలేజీలో 60 సీట్లు , ఆరు వర్సిటీ కాలేజీల్లో 354  సీట్లున్నట్టు చెప్పారు. 72 కాలేజీల్లో1,449 ఫార్మాడీ సీట్లు ఉండగా.. రెండు కాలేజీల్లో 51బయోమెడికల్ కోర్సు సీట్లు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు.

బయో టెక్నాలజీ కోర్సు నాలుగు కాలేజీల్లో ఉండగా166 సీట్లు.. ఫార్మాస్యూటికల్ కోర్సు ఒక కాలేజీలో ఉండగా 30 సీట్లు ఉన్నట్టు ప్రకటించారు. ఆయా సీట్ల భర్తీ కోసం ఈ నెల 19 నుంచి ఎప్​సెట్ (ఎంపీసీ స్ర్టీమ్) అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఈ నెల 19 నుంచి 22 వరకూ రిజిస్ర్టేషన్లతో పాటు సర్టిఫికెట్ల వెరిఫికేషన్​కు స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంది.