కౌంట్ డౌన్ : తెల్లవారుజామున 4 గంటలకే EVM స్ట్రాంగ్ రూమ్స్ ఓపెన్

కౌంట్ డౌన్ : తెల్లవారుజామున 4 గంటలకే EVM స్ట్రాంగ్ రూమ్స్ ఓపెన్

ఎన్నికల కురుక్షేత్రం 2024లో గెలిచేదెవరు అనేది మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతున్నది. 20 రోజులుగా స్ట్రాంగ్ రూమ్స్ లో భద్రంగా ఉన్న EVMలు బయటకు రానున్నాయి. కౌంటింగ్ కేంద్రాలకు తరలివెళ్లనున్నాయి. అభ్యర్థుల జాతకాలను చెప్పను న్నా యి. ఇదంతా ఓకే.. అసలు స్ట్రాంగ్ రూంలను ఎన్ని గంటలకు ఓపెన్ చేయనున్నారు అనేది ఆసక్తిగా మారింది. ఈ వివరాలే ఇప్పుడు చూద్దాం...

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి EVMను స్ట్రాంగ్ రూంల్లో భద్రపరిచారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో తెల్లవారుజామున 4 గంటలకే స్ట్రాంగ్ రూంలను ఓపెన్ చేయనున్నారు. అక్కడి నుంచి EVM మెషీన్లను కౌంటింగ్ కేంద్రాలకు తరలించనున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి EVMను స్ట్రాంగ్ రూంల్లో భద్రపరిచారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో తెల్లవారుజామున 4 గంటలకే స్ట్రాంగ్ రూంలను ఓపెన్ చేయనున్నారు. అక్కడి నుంచి EVM మెషీన్లను కౌంటింగ్ కేంద్రాలకు తరలించనున్నారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ తో లెక్కింపు మొదలవుతుంది. ఆ తర్వాత మరో అరగంటలో కౌంటింగ్ ఈవీఎంలలో పోలైన ఓట్లు లెక్కింపు ప్రారంభం అవుతుంది.

కౌంటింగ్ ప్రారంభించే ముందు ఆయా పార్టీల ఏజెంట్ల సమక్షంలో EVM లను తనఖీ చేసి ఓపెన్ చేస్తారు. ప్రతి రౌండ్ EVM కౌంటింగ్ తర్వాత ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకుడు ఏదైనా రెండు EVM లను ఎంచుకుని ఖచ్చితత్వాన్ని ధృవీకరించేందుకు మరోసారి లెక్కిస్తారు. అనంతరం రిటర్నింగ్ అధికారి ఆ రౌండ్ ఫలితాలను ప్రకటించి డాక్యుమెంట్ చేస్తారు. అన్ని రౌండ్లలో అన్ని EVM ఓట్ల లెక్కింపు జరిగిన తర్వాతే VVPAT స్లిప్ లను లెక్కిస్తారు. దీని తర్వాత తుది ఫలితా ల ను ప్రకటిస్తారు.