
- రఘునందన్‌రావు కేసుల్లో కౌంటర్లుదాఖలు చేయండి
- పోలీసులకు హైకోర్టు ఆదేశం..విచారణ 29కి వాయిదా
హైదరాబాద్, వెలుగు: సిద్ధిపేట జిల్లా దుబ్బాక, నల్గొండ జిల్లా పెదవూర పోలీసు స్టేషన్‌లలో మెదక్ ఎంపీ రఘునందన్‌రావుపై నమోదైన కేసుల్లో కౌంటరు దాఖలు చేయాలంటూ పోలీసులకు హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులను కొట్టివేయాలని కోరుతూ రఘునందన్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌లపై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ..అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలీసు స్టేషన్‌లో వాగ్వాదానికి దిగి విధులకు అడ్డంకులు సృష్టించారంటూ కేసు నమోదు చేశారన్నారు.
అదేవిధంగా.. 2024లో ఎన్.జీవన్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు దుబ్బాక, ఎంపీడీఓ దుబ్బశ్యామ్ ఫిర్యాదు మేరకు నల్గొండ జిల్లా పెదవూర పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయన్నారు. ఎలాంటి ఆధారాలు లేనందున ఈ కేసులకు కొట్టివేయాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి పోలీసులతోపాటు, ఫిర్యాదుదారులకు నోటీసులు జారీ చేశారు. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈనెల 29వ తేదీకి వాయిదా వేశారు.