
తెలంగాణ నార్కోటిక్ డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో, ఎస్టీఎఫ్ జాయింట్ ఆపరేషన్ చేపట్టి నకిలీ డ్రగ్ రాకెట్‌ను చేధించాయి. ఉత్తరప్రదేశ్ నుండి తెలంగాణకు కొరియర్ ద్వారా రవాణా చేస్తోన్న నకిలీ యాంటీ బయాటిక్ మెడిసిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో ఫెంటానిల్ ట్రాన్స్‌డెర్మల్ డ్రగ్స్‌ను సీజ్ చేశారు. ఆంధ్రాలోని ప్రొద్దుటూరు నివాసి మునిశేఖర్ సహకారంతో ఈ డ్రగ్స్ సప్లై జరుగుతోందని అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న నకిలీ యాంటీబయాటిక్స్ విలువ రూ.6.91 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.