- నకిలీ దగ్గు మందుబాటిల్స్ సీజ్
కూకట్పల్లి, వెలుగు: కూకట్పల్లి ప్రశాంత్నగర్పారిశ్రామికవాడలో నకిలీ కాఫ్ సిరప్ తయారు చేస్తున్న ఇండస్ట్రీపై అధికారులు బుధవారం దాడులు చేశారు. ‘గ్లైకోరిల్ కాఫ్ సిరప్’ పేరుతో ఉన్న బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
ప్రశాంత్‌నగర్‌లోని ప్లాట్‌నెంబర్2 ఫస్ట్ ఫ్లోర్లో అఖిల్ లైఫ్ సైన్సెస్ పేరుతో సి.భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తి.. లైసెన్స్ లేకుండా ఈ ఇండస్ట్రీ నడుపుతున్నట్టు తెలంగాణ రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో అధికారులు దాడులు చేసి సిరప్ శాంపిల్స్ సేకరించారు.
సుమారు రూ.65 వేల విలువ చేసే 635 బాటిల్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ తయారు చేస్తున్న సిరప్‌ను బెంగళూరులోని గామీ ఫార్మా స్యూటికల్స్ సంస్థ పేరుతో మార్కెటింగ్ చేస్తున్నారు. ఈ పేర్లతో ఎక్కడైనా మార్కెట్లో కాఫ్ సిరప్ కనిపిస్తే ఎవరూ కొనుగోలు చెయ్యవద్దని అధికారులు సూచించారు.