ఆగని నకిలీ సీడ్స్ దందా..సరిహద్దు రాష్ట్రాల నుంచి సరఫరా

  •     గుట్టు చప్పుడు కాకుండా విక్రయాలు
  •     భారీగా పట్టుబడుతున్న నకిలీ విత్తనాలు
  •     ఏటా లేటుగా స్పందిస్తున్న ప్రభుత్వం..
  •     అప్పటికే రైతులకు చేరుతున్న సీడ్స్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు; రాష్ట్రంలో నకిలీ విత్తనాల దందా జోరుగా సాగుతున్నది. టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాడుల్లో క్వింటాళ్లు, టన్నుల కొద్ది నకిలీ, నాసిరకమైన సీడ్స్​ దొరుకుతున్నాయి. గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఏపీ, మహారాష్ట్ర, కర్నాటక, చత్తీస్​గఢ్ తదితర రాష్ట్రాల నుంచి కొన్ని ముఠాలు నకిలీ సీడ్స్​ను రాష్ట్రానికి తరలిస్తున్నాయి. ఇక్కడి వ్యాపారులతో కుమ్మక్కై గుట్టు చప్పుడు కాకుండా అమ్ముతున్నారు. రాష్ట్ర సర్కార్ లేటుగా స్పందించడంతో విత్తనాలు నాటే టైమ్ కు రైతుల వద్దకు చేరిపోతున్నాయి. నకిలీ సీడ్స్​అరికట్టడంపై ప్రభుత్వానికి ముందుచూపు, ప్రణాళి లేకపోవడంతో ఏటా రైతులు నష్టపోతున్నారు.

రెండు ముఠాల అరెస్టు

తాజాగా వరంగల్ జిల్లా కేంద్రంగా నకిలీ విత్తనాల అమ్మకానికి పాల్పడుతున్న రెండు ముఠాలను టాస్క్ ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసులు, అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేపట్టి అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. వీరి నుంచి రూ.2.11 కోట్ల విలువైన 7 టన్నుల విడి విత్తనాలు, 9వేల 765 నకిలీ విత్తనాల ప్యాకెట్లు, ఒక డీసీఎం వ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఒక కారు, రూ.21 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల రాష్ట్ర సరిహద్దుల్లో టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసుల తనిఖీల్లో 2.65 టన్నుల నకిలీ కాటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  సీడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్టుకున్నారు.3

నిషేధిత హెచ్​టీ సీడ్స్, గ్లైఫోసైట్

ఎక్కువ దిగుబడి వస్తుందని, కూలీలతో కలుపు తీసే అవసరం ఉండదని నమ్మించి నిషేధిత హెచ్ టీ(హెర్బిసైడ్స్ టాలెరెంట్) కాటన్ విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. వీటిని నాటితే కలుపు నివారణకు గ్లైఫోసైట్ మందులు కొట్టాల్సి ఉంటుంది. గ్లైఫోసైట్ లు వాడితే పర్యావరణానికి, రైతులకు హాని జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గ్లైఫోసైట్ లను ప్రభుత్వం నిషేధించింది. అయినా ఇవి ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా అమ్ముతున్నరు. ప్రధానంగా మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలో హెచ్​టీ విత్తనాల పెద్ద ఎత్తున అమ్ముతున్నారు.

నకిలీల్లో పత్తి విత్తనాలే ఎక్కువ

వానాకాలం సీజన్లో 70 లక్షల నుంచి 80 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగవుతుందని వ్యవసాయశాఖ తాజా అంచనాలు ఉన్నాయి. ఎకరానికి రెండు చొప్పున కాటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్యాకెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు అవసరం. 450 గ్రాములుండే ప్యాకెట్ ధర రూ.853కు అమ్మాలని సర్కారు ధర నిర్ణయించింది. పత్తి విత్తనాలను లూజుగా అమ్మొద్దనే నిబంధనలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి బస్తాల్లో పత్తి విత్తనాలు తెచ్చి కిలోల చొప్పున అమ్ముతున్నరు. కొన్ని ముఠాలు ప్రముఖ కంపెనీల పేర్లున్న ప్యాకెట్లలో ప్యాక్ చేసి బీటీ విత్తనాలుగా నమ్మించి అమ్మేస్తున్నారు. కొన్ని విత్తన కంపెనీలు గద్వాల జిల్లాలో రైతులతో అగ్రిమెంట్లు చేసుకొని30 వేల ఎకరాలల్లో కాటన్ సీడ్స్ సాగు చేయిస్తున్నాయి. ఇక్కడ పండిన విత్తనాలు నాణ్యంగా లేకుంటే కంపెనీలు వాటిని వెనక్కిచ్చేస్తాయి. దళారులు ఇలాంటి విత్తనాలను కొని నకిలీ ప్యాకింగ్​తో అమ్ముతున్నారు. ఈ విత్తనాలు క్యూఆర్ కోడ్ కిందకు రాకపోవడంతో అసలేదో నకిలీ ఏదో రైతులు గుర్తించలేకపోతున్నారు.

లేటుగా తనిఖీలు..

ఏటా రాష్ట్రంలో నకిలీ విత్తనాల దందా వెలుగు చూస్తున్నా.. కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమవుతున్నది. మార్చి ప్రారంభం నుంచే నిఘా పెట్టి పకడ్బందీ చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నెలా రెండు నెలల ముందుగానే నకిలీ విత్తన అమ్మకాలు చేస్తునట్లు తెలుస్తున్నది. తాజాగా వ్యవసాయ శాఖ పోలీసు అధికారులతో కలిసి ప్రత్యేక టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేసింది. అయితే అప్పటికే చాలా వరకు నకిలీ విత్తనాలు రైతులకు చేరాయి. సర్కార్ ముందే మేల్కొని ఉంటే నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉండేది.