ఒడిశా, కేరళ, ఉత్తరాఖండ్ లో మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్‌ను 2022, జూన్ 03వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటలకు అధికారులు ప్రారంభించారు. ఒడిశాలోని బ్రజరాజ్ నగర్(Brajarajnagar), కేరళలోని త్రిక్కకర (Thrikkakara), ఉత్తరాఖండ్ చంపావత్ (Champawat)లో ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ మూడు అసెంబ్లీ స్థానాలకు మే 31న పోలింగ్ జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఖటిమా నియోజకవర్గం నుంచి పరాజయం చెందిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ పరాజయం చెందారు. ఆయన సీఎం అవుతారా ? లేదా ? అనే ఉత్కంఠ అప్పట్లో నెలకొంది. శాసనసభాపక్ష సమావేశంలో ధామీ పార్టీ నాయకుడిగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన రెండోసారి రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
మే 31న ఎర్నాకులంలోని త్రిక్కకర అసెంబ్లీ స్థానానికి ఎన్నిక జరిగింది. 68.75 శాతం ఓటింగ్ నమోదైంది. కాంగ్రెస్ నేత ఉమా థామస్, సీపీఐ(ఎం) పార్టీకి చెందిన డాక్టర్ జోసెఫ్ మధ్య పోటీ నెలకొంది. థామస్ సతీమణి మరణంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. బీజేపీ అభ్యర్థి రాధాకృష్ణన్ కూడా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మే31న జార్సుగూడ జిల్లాలోని బ్రజరాజ్ నగర్ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో 71.90 శాతం ఓటింగ్ నమోదైంది. 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీజేడీ అభ్యర్థి అలకా మొహంతి, బీజేపీ అభ్యర్థి రాధారాణి పాండా మధ్య పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. మే 31న ఉత్తరాఖండ్ లోని చంపావత్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో 64 శాతం ఓటింగ్ నమోదైంది. నలుగురు అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.
మరిన్ని వార్తల కోసం : -
ఇవాళ యూపీలో ఇన్వెస్టర్ల సదస్సు
పైసలు ఇయ్యంది పల్లెల్లో ప్రగతి ఎట్ల సాధ్యం ?