కొండపోచమ్మ ఆలయ హూండీ లెక్కింపు

కొండపోచమ్మ  ఆలయ హూండీ లెక్కింపు

జగదేవపూర్, వెలుగు: సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని తీగుల్ నర్సాపూర్ సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కొండపోచమ్మ అమ్మవారి ఆలయ హూండీని శనివారం దేవాదాయ, ధర్మాదాయ శాఖ  ఆధ్వర్యంలో  లెక్కించారు. 72 రోజులకు గాను రూ.4,15,833  నగదుతో పాటు మిశ్రమ బంగారం 364 గ్రాములు, వెండి 8 కిలోల 600 గ్రాములు వచ్చినట్లు ఆలయ సూపరింటెండెంట్ శివరాజ్, ఆలయ ఈఓ మోహన్ రెడ్డి తెలిపారు. 

అమ్మవారికి కానుకల రూపంలో వచ్చిన ఆదాయం అమ్మవారి ఆలయ ఖాతాలో జమ చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది  వెంకట్ రెడ్డి, కనకయ్య,  పూజారులు మల్లయ్య, లక్ష్మణ్, కొండయ్య, తిరుపతి, గోవర్దన్ ఉన్నారు.