ముల్కలపల్లి మినీ మేడారం జాతర హుండీల లెక్కింపు

  • ఆదాయం రూ. 7 లక్షల 81 వేలు

మొగుళ్లపల్లి,వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ములకలపల్లి మొగుళ్లపల్లి గ్రామాల మధ్య గత నెల ఫిబ్రవరి 21  నుంచి 24 వరకు జరిగిన మినీ మేడారం జాతర హుండీల లెక్కింపు సోమవారం పోలీస్ బందోబస్తు నడుమ  సాంబమూర్తి దేవాలయంలో జరిగింది.  9 హుండీలను జాతర నిర్వాణ కమిటీ సభ్యులు, ఎండోమెంట్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో  ఏర్పాటు చేశారు.

 కొద్ది రోజులపాటు లెక్కింపు వాయిదా పడుతూ వచ్చింది.  ఎట్టకేలకు సోమవారం హుండీ లెక్కించగా.. మొత్తం ఆదాయం రూ. 7లక్షల 81వేలు వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో  తహసీల్దార్ సునీత, ఎండోమెంట్ ఆఫీసర్లు  అనిల్ కుమార్,నాగేశ్వరరావు, మహిపాల్, జాతర కమిటీ చైర్మన్ బుర్ర సదయ్య, మాజీ చైర్మన్  అన్నారెడ్డి, మల్శాన్ని నరసింహారావు, జగ్గారావు  పాల్గొన్నారు.