
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఆ తరువాత అంటే 8.30 గంటల నుంచి ఈవీఎంలను లెక్కిస్తారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడెంచల భద్రతను ఏర్పాటు చేశారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలతో పాటుగా ఏపీ, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కూడా కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. తెలంగాణలోనూ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. కాగా, ఇప్పటికే గుజరాత్ లోని సూరత్ లోక్ సభ స్థానాన్ని కైవసం చేసుకుని బీజేపీ ఖాతా తెరిచింది.