భారత్‌‌‌‌ను టార్గెట్‌ చేస్తున్న అమెరికా, చైనా, పాకిస్థాన్‌‌‌‌, బ్రిటన్‌‌‌‌

భారత్‌‌‌‌ను టార్గెట్‌ చేస్తున్న అమెరికా, చైనా, పాకిస్థాన్‌‌‌‌, బ్రిటన్‌‌‌‌

స్వాతంత్య్ర సమరం సమయంలో జలియన్‌‌‌‌ వాలాబాగ్‌‌‌‌లో జనరల్‌‌‌‌ డయ్యర్‌‌‌‌ ఆదేశాల మేరకు మన సైనికులే భారతీయ వీరులపై కాల్పులు జరిపారు. దీన్ని ‘బానిస మనస్తత్వం’ అని పిలుస్తారు. ఇపుడు కూడా అమెరికా, -చైనా,- పాకిస్థాన్‌‌‌‌, -బ్రిటన్‌‌‌‌ లాంటి దేశాలు ఎప్పుడూ భారత్‌‌‌‌ను టార్గెట్‌‌‌‌ చేస్తూనే ఉన్నాయి. వాళ్ల ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసం అన్ని దేశాల్లో చిచ్చుపెట్టినట్లే140 కోట్ల జనాభా, ఎంతో వైవిధ్యత ఉన్న ఈ దేశంలో చిచ్చుపెట్టి అతిపెద్ద మార్కెట్‌‌‌‌ను తమకు అనుకూలంగా చేసుకోవాలని చూస్తున్నాయి. అందులో భాగంగా నెల రోజుల నుంచి అనేక బయటి,- లోపలి శక్తులు ‘భారత్‌‌‌‌పై’ యుద్ధం ప్రకటించాయి. ఇప్పుడు కూడా బానిస మనస్తత్వం వదులుకోలేని వ్యవస్థలు వాళ్లకు టూల్‌‌‌‌కిట్‌‌‌‌గా మారుతున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్‌‌‌‌లో వాళ్ల వేట నరేంద్ర మోడీ. జలియన్‌‌‌‌ వాలాబాగ్‌‌‌‌ దురంతం జరిపిన సైనికుల్లాగే ఇక్కడి ప్రతిపక్షపార్టీలు ఈ అవకాశాన్ని అదనుగా చేసుకున్నాయి.

మొదట బీబీసీ వండివార్చిన డాక్యుమెంటరీతో 2002లో జరిగిన గుజరాత్‌‌‌‌ అల్లర్లను నరేంద్ర మోడీపైకి నెట్టే ప్రయత్నం చేసింది. 27 ఫిబ్రవరి 2002న గోద్రా రైలులో ప్రయాణం చేస్తున్న రామభక్తుల బోగీలకు మంటబెట్టి నిర్దాక్షిణ్యంగా బూడిద చేసి చంపారు. అందులో స్త్రీ, పురుషులు, పిల్లలతో కలిపి 59 మంది అతి దారుణంగా ప్రాణాలు కోల్పోయారు. దానివల్ల అక్కడ మతఘర్షణలు జరిగాయి. దాన్ని ప్రపంచ వ్యాప్తంగా వివాదం చేసి మోడీని దోషిగా నిలబెట్టే ప్రయత్నం జరిగింది. కొన్ని దేశాలు ఇప్పుడు మోడీకి రెడ్‌‌‌‌ కార్పెట్‌‌‌‌ పరిచినా అప్పుడు వీసాలు ఇవ్వలేదు. ఈ అల్లర్లకు మోడీయే కారణం అని దేశంలోని అన్ని సూడో సెక్యులర్‌‌‌‌ పార్టీలు గొడవ చేసి మోడీకి పరోక్షంగా చక్కని ప్రచారం కల్పించాయి. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నందున ఆ విషయాన్ని నెగెటివ్‌‌‌‌గా ప్రచారం చేసేందుకు మరోసారి బీబీసీ ఓ డాక్యుమెంట్‌‌‌‌ రూపొందించింది. అయితే ప్రతిపక్షాలు దీన్ని గొప్ప వరంగా భావించి ప్రచారంలోకి దూకాయి. ఈ డాక్యుమెంటరీని భారత్‌‌‌‌ నిషేధించింది. కేరళలోని కొన్నూర్‌‌‌‌ వర్సిటీ, త్రివేండ్రం లా కాలేజీ, హైదరాబాద్‌‌‌‌ సెంట్రల్‌‌‌‌ యూనివర్సిటీలోని వామపక్ష, కాంగ్రెస్‌‌‌‌ విద్యార్థి సంస్థలు ప్రదర్శనకు పెట్టారు. జేఎన్‌‌‌‌యూలో కూడా అలాంటి ప్రయత్నం జరిగింది. బీబీసీ డాక్యుమెంట్‌‌‌‌ను ప్రభుత్వం నిషేధించినా ‘డాక్‌‌‌‌వెబ్‌‌‌‌’ లాంటి వాటి ద్వారా డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసుకొని ఈ దుస్సాహసానికి ఈ సంస్థలు పూనుకున్నాయి. అయితే ఈ డాక్యుమెంట్‌‌‌‌లో పచ్చి అబద్ధాలు ప్రచారం చేసిన బీబీసీకి భారత్‌‌‌‌పై విషం కక్కడం ఇదేమీ కొత్త కాదు. గతంలో 1970లో ఈ దేశంలోని సంస్కృతిని, ఇతర రాజకీయ విషయాలను హేళన చేస్తూ డాక్యుమెంటరీలు రూపొందించింది. 1970-–72 మధ్య ప్రధాని ఇందిర కాలంలోనే రెండుసార్లు నిషేధానికి గురైంది. విచిత్రం ఏమిటంటే బీబీసీని మనదేశ అత్యున్నత న్యాయ స్థానాల కన్నా గొప్పగా చూసే సంస్థల బేలతనం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. గుజరాత్‌‌‌‌ అల్లర్లపై కాంగ్రెస్‌‌‌‌ నేత యయసాన్‌‌‌‌ జాఫ్రీ భార్య జాకీయా జాఫ్రీ ఫిర్యాదుతో నాటి గుజరాత్‌‌‌‌ సీఎం మోడీ, ఆయన మంత్రులు, నేతలపై కేసు నమోదైంది. ఆ తర్వాత 2006 జూన్‌‌‌‌లో నాటి యూపీఏ ప్రభుత్వం సుప్రీం ఆదేశాలతో ఆర్‌‌‌‌కె రాఘవన్‌‌‌‌ నేతృత్వంలో సిట్‌‌‌‌ ఏర్పాటు చేసింది. 2008లో సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌‌‌‌ ఆధారంగా రెండేళ్లు విచారణ జరిగింది. 2010లో సిట్‌‌‌‌ గాంధీనగర్‌‌‌‌ కార్యాలయానికి మోడీ వెళ్లి సాధారణ వ్యక్తిలా విచారణ ఎదుర్కొన్నాడు. సుమారు 9 గంటలపాటు108 ప్రశ్నలతో సిట్‌‌‌‌ మోడీని ప్రశ్నించింది. 8 ఫిబ్రవరి 2012న మోడీకి క్లీన్‌‌‌‌చిట్‌‌‌‌ లభించింది. 2017లో గుజరాత్‌‌‌‌ హైకోర్టు, 2022లో సుప్రీంకోర్టు సిట్‌‌‌‌ పరిశోధన ఆధారంగా ఈ అల్లర్లకు సంబంధించి నరేంద్రమోడీకి ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేశాయి. అయినా ఈ దేశంలో మేధావులు, అర్బన్‌‌‌‌ నక్సల్స్‌‌‌‌ మోడీని టార్గెట్‌‌‌‌ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనదేశ దర్యాప్తు సంస్థల కన్నా విదేశీ సంస్థలను బాగా నమ్మే ‘బ్రేకింగ్‌‌‌‌ ఇండియా ఫోర్సెస్‌‌‌‌’ ఈ విషయంలో బీబీసీని పరమ ప్రామాణికంగా చేసుకొని మరోసారి విషం కక్కుతున్నాయి. అయితే ఈ అంశం ప్రజల్లోకి వెళ్లగానే గుజరాత్‌‌‌‌ అల్లర్ల వెనుక జరిగిన దుర్మార్గం, గోద్రా హత్యాకాండను ప్రశ్నించగానే ఇది జాతీయ దృక్కోణంలోకి వెళ్లి అంతిమంగా మోడీకి లాభం అవుతుందని భావించి ఈ ఫోర్సెస్‌‌‌‌ వెనక్కి తగ్గాయి. గత ఎన్నికల ముందు ఈవీఎంల టాంపరింగ్‌‌‌‌ అంటూ కపిల్‌‌‌‌ సిబాల్‌‌‌‌ ఎలా అయితే దుష్ప్రచారం చేశారో ఇప్పుడూ అలాగే బీబీసీని వాడుదామంటే అది బెడిసికొట్టింది.

కుట్రలు ఫలిస్తే ప్రమాదం

1బిలియన్‌‌‌‌ డాలర్లు గ్లోబల్‌‌‌‌ యూనివర్సిటీ పేరుతో ఖర్చుపెట్టి జాతీయవాదంపై యుద్ధం చేయమని సారోస్‌‌‌‌ రెచ్చగొట్టాడు. ప్రస్తుతం ఈ అంశం లడ్డూలా ప్రతిపక్షాలకు దొరికింది. 2019 ఎన్నికల ముందు ఫ్రాన్సుకు చెందిన షేర్పా అసోసియేషన్‌‌‌‌ రాఫెల్‌‌‌‌ యుద్ధవిమానాలపై ఫిర్యాదు చేస్తే రాహుల్‌‌‌‌గాంధీ ‘చౌకీదార్‌‌‌‌ చోర్‌‌‌‌ హై’ అన్నాడు. తర్వాత అది సుప్రీంకోర్టు తీర్పుతో పేలిపోయింది. ఇప్పుడు ఎన్నికలకు ఏడాదిముందు అక్రమాలతో భారత్‌‌‌‌ను దోచే సంస్థలన్నీ కొత్త కొత్త వేషాలతో ముందుకు వస్తున్నాయి. సారోస్‌‌‌‌ ఆరోపణలను కాంగ్రెస్‌‌‌‌ ఖండించినా, మోడీని కొట్టేందుకు ఏ విషయం దొరకనందున దీన్నే ఆయుధంగా చేసుంకుంటారా అనేది చూడాలి. బీబీసీ, హిండెన్‌‌‌‌బర్గ్‌‌‌‌, జార్జ్‌‌‌‌ సారోస్‌‌‌‌ లాంటి అంతర్జాతీయ కుట్రపూరిత సంస్థలు ఇపుడు మన దేశ రాజకీయాలను శాసించడం దుష్పరిణామం. మరీ ముఖ్యంగా భారత్‌‌‌‌ లాంటి వైవిధ్యభరిత, అతిపెద్ద దేశంలో ఈ కుట్రలు ఫలిస్తే మనం 
ప్రమాదంలో పడినట్లే!


జార్జ్‌‌‌‌ సారోస్‌‌‌‌ను రంగంలోకి దింపి..

వెంటనే అదను చూసి అమెరికా వ్యాపార దిగ్గజం జార్జ్‌‌‌‌సారోస్‌‌‌‌ను రంగంలోకి దింపారు. 92 ఏళ్ల హంగరీలో పుట్టి అమెరికాలో వ్యాపారం చేస్తూ యయోదీ మతానికి చెందిన నాస్తిక సారోస్‌‌‌‌ అంతర్జాతీయ భారత వ్యతిరేక శక్తుల ప్రోద్బలంతో నేరుగా మోడీపై పడ్డాడు గతంలో. ఇరాక్‌‌‌‌లో సద్దాం హుస్సేన్‌‌‌‌ను, లిబియాలో మహమ్మద్‌‌‌‌ గఢాఫీలను ప్రజాందోళన చేయించి చంపేసినట్లే భారత్‌‌‌‌లో చేయించాలనే ఈ కుట్ర మొదలైంది. కాశ్మీర్‌‌‌‌లో ఆర్టికల్‌‌‌‌370 ఎత్తేశాక, సీఏఏ చట్టం వచ్చాక ఇలాంటి కుట్ర చేసినా అది ఫలించలేదు. గౌతమ్‌‌‌‌ అదానీ విషయంలోనే మోడీ 2024లో ఓడిపోయి భారత్‌‌‌‌లో ప్రజాస్వామ్యం వస్తుందని ఆ నాస్తిక కాలజ్ఞాని కారుకూతలు కూశాడు. జర్మనీలో జరిగిన ‘మ్యూనిక్‌‌‌‌ సెక్యూరిటీ కౌన్సిల్‌‌‌‌’లో జార్జ్‌‌‌‌ సారోస్‌‌‌‌ భారత్‌‌‌‌పై విషం కక్కాడు. ఈ సారోస్‌‌‌‌1984 నుంచి ‘ఓపెన్‌‌‌‌ సొసైటీ ఫౌండేషన్‌‌‌‌’ పేరుతో ఓ ఎన్జీవో నడుపుతున్నాడు. ఈ సంస్థ సాయం పేరుతో 120 దేశాల్లో ఆ దేశాల వ్యతిరేక శక్తులను ప్రోత్సహిస్తున్నది. 8.5 బిలియన్‌‌‌‌ యూఎస్‌‌‌‌ డాలర్లతో నడిచే ఈ సంస్థ మనదేశంలోని తుక్డే తుక్డే గ్యాంగ్‌‌‌‌లకు సాయం చేస్తూ వస్తున్నది. వివిధ దేశాలను బలహీనపరిచేందుకు 70 దేశాల్లో సారోస్‌‌‌‌ ఎన్జీవో తీవ్రంగా పనిచేస్తున్నది. 2016లో భారత ప్రభుత్వం ఎన్నికల అక్రమ నిధుల అడ్డుకట్టలో భాగంగా ఈ సంస్థను నిఘా పరిధిలోకి చేర్చింది. అప్పటి నుంచి భారత్‌‌‌‌పై కుట్రకు ఈ సంస్థ తెరలేపింది. పీఎఫ్‌‌‌‌ఐ, అర్బన్‌‌‌‌ నక్సల్‌‌‌‌, పత్రికలు, లూటియన్‌‌‌‌ మీడియా, మతమార్పిడి సంస్థలు భారత వ్యతిరేక ఎకో సిస్టంకు ఈ ఎన్జీవో పరోక్ష సహకారం అందిస్తూనే ఉంది. ఈ ఎన్జీవో వైస్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ సలీల్‌‌‌‌ శెట్టి 11 అక్టోబర్‌‌‌‌ 2022న రాహుల్‌‌‌‌ చేపట్టిన భారత్‌‌‌‌ జోడో యాత్రలో పాల్గొనడం కొత్త అనుమానాలకు దారితీస్తోందంటూ బీజేపీ ఆరోపిస్తున్నది. 2020లో జరిగిన వరల్డ్‌‌‌‌ ఎకానమీ ఫోరంలో మోడీని నియంత అనీ, కాశ్మీర్‌‌‌‌ ప్రజలను శిక్షిస్తున్నాడు అని సారోస్‌‌‌‌ తిట్టిపోశాడు.


అదానీ అంశం తెరపైకి తెచ్చి..

ఇక బీబీసీని వదిలేసి గౌతమ్‌‌‌‌ అదానిపై పడ్డారు. అమెరికాలో 2017లో స్థాపితమైన హిండెన్‌‌‌‌బర్గ్‌‌‌‌ సంస్థ ఆదానీ సంస్థలపై 106 పుటల రిపోర్ట్‌‌‌‌ ఇచ్చింది. మోడీ–అదానీ ఇద్దరూ గుజరాతీలు కావడంతో వాళ్ల మధ్య ఏదో ప్రత్యేక సంబంధం ఉందని దుష్ప్రచారం మొదలుపెట్టారు. ఏం అంశం కూడా విపక్షాల్లోనూ ఐక్యత తీసుకురాలేదు. కానీ అదానీ అంశం విపక్షాలను ఒక్కతాటిపైకి తెచ్చింది. ఇక్కడ కూడా విపక్షాల, లూటియన్‌‌‌‌ మీడియా టార్గెట్‌‌‌‌ అదానీ కంపెనీ ఎంత మాత్రం కాదు మోడీయే! షేర్‌‌‌‌ మార్కెట్లలో అదానీ పెట్టుబడుల పతనం కాగానే షేర్లు చాలా నష్టపోయాయి. వెంటనే భారత ప్రభుత్వం ఆర్జీవై ద్వారా అన్ని బ్యాంకులకు నోటీసులు ఇచ్చి అదానీ సంస్థలపై విచారణలాగ పనిమొదలు పెట్టింది. స్వయంగా గౌతమ్‌‌‌‌ అదానీ మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చినా, రాఫెల్‌‌‌‌ యుద్ధ విమానాల కొనుగోలు లాగానే దుష్ప్రచారం మొదలుపెట్టారు. భోపాల్‌‌‌‌ గ్యాస్‌‌‌‌ దుర్ఘటనలో ఎందరినో బలిగొన్న వారెన్‌‌‌‌ అండర్సన్‌‌‌‌ను రాత్రికి రాత్రి ఎవరు దేశం దాటించారో అందరికీ తెలుసు. నీరారాడియా టేపుల సీక్రెట్స్‌‌‌‌, భోఫోర్స్‌‌‌‌, నేషనల్‌‌‌‌ హెరాల్డ్‌‌‌‌ కేసులోనూ ఎంత చాకచక్యంగా డబ్బు సంపాదించారో అందరికీ తెలుసు. కానీ గౌతమ్‌‌‌‌ అదానీ డబ్బులిస్తే మోడీ ఏమైనా తమ పిల్లలకు ఇచ్చి ఆస్తులు కూడబెట్టారా? అనే ప్రశ్న ఇప్పుడు మొదలైంది. దాంతో అదానీ ఇష్యూ పలచన అవడం మొదలైంది. అలాగే ఇటీవల బయటపడిన జమ్మూకాశ్మీర్‌‌‌‌లో ‘లిథియం నిల్వలు’ ఇప్పుడు అగ్రరాజ్యాలకు కంటగింపు అయింది. ఆ ముడిమూలకాన్ని ప్రాసెస్‌‌‌‌ చేయాలంటే ఒకటి రెండూ పెద్ద దేశాలకే ఆ అవకాశం ఉంది. మనదేశీయమైన అదానీ వంటి కంపెనీలకు అది రాకుండా చేయాలంటే అదానీ గ్రూప్‌‌‌‌ను అపఖ్యాతి పాలు చేయాలనే 
విదేశీకుట్ర మొదలైంది. 

- డా.పి. భాస్కర యోగి,