
హైదరాబాద్, వెలుగు: డెయిరీ ప్రొడక్టులు అమ్మే కంట్రీ డిలైట్ తేనెను కూడా మార్కెట్లో విడుదల చేసింది. దీనిని న్యూక్లియర్ మాగ్నెటిక్ రెసొనెన్స్ (ఎన్ఎంఆర్) ద్వారా పరీక్షించారు.
ఇందులో చక్కెరను చేర్చలేదు. ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రమాణాల ప్రకారం 36 నాణ్యతా పరీక్షలను సైతం ఎదుర్కొందని కంట్రీ డిలైట్ సీఈఓ, కో–ఫౌండర్ చక్రధర్ గడే చెప్పారు. ప్రతి బ్యాచ్‌కు ఎన్ఎంఆర్ పరీక్షలు జరుగుతాయని చెప్పారు.
కంట్రీ డిలైట్ ఫార్మ్ హనీ ధరలు రూ.196–రూ.233 మధ్య ఉంటాయి. దీనిని 17 ప్రధాన భారతీయ నగరాల్లో కంట్రీ డిలైట్ యాప్ ద్వారా ఆర్డర్ చేయవచ్చు.