మోదీ పాలనలో దేశం తిరోగమనం

జగిత్యాల టౌన్, వెలుగు: ప్రధాని మోదీ హయాంలో దేశం ఆర్థికంగా తిరోగమనం చెందుతోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. జగిత్యాలలోని ఇందిరాభవన్‌లో ఆదివారం రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్​యాత్ర పోస్టర్‌‌ను ఆవిష్కరించి, తన వాహనానికి అతికించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశాల్లోని నల్లధనం తీసుకువస్తామని అధికారంలోకి వచ్చిన మోదీ ఆ తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. మోదీ అనాలోచిత నిర్ణయాలతో నిత్యావసరాల ధరలు పెరిగాయని విమర్శించారు.