![సినిమాల కన్నా దేశమే ముఖ్యం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్](https://static.v6velugu.com/uploads/2024/08/country-is-more-important-than-movies-deputy-cm-pawan-kalyan_tNFVBPnpUd.jpg)
అమరావతి: తనకు సినిమాల కంటే సమాజం, దేశమే ముఖ్యమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయని నమ్ముతానని తెలిపారు. ఏపీ అన్నమయ్య జిల్లా మైసూర్‌వారి పల్లిలో ఆయన మాట్లాడుతూ ‘సినిమాలను, రాజకీయాలను ప్రత్యేకంగా చూస్తా. మన దగ్గర మిరాకిల్ ఏం లేదు. పనిచేయాలన్న చిత్తశుద్ధి ఉంది. గుండెల నిండా కమిట్‌మెంట్‌తో పనిచేస్త. నాకంటే బాగా ఆలోచించగలిగేవాళ్ల వెంట నడిచేందుకు నేనేమీ సంకోచించను. అపార అనుభవం ఉన్నచంద్రబాబు దగ్గర నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్న’ అని పవన్ తెలిపారు.