ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

  • కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాతీయ రాజకీయాల్లోకి  వస్తేనే దేశం బాగుపడుతుంది
  • మంత్రి వేముల ప్రశాంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి

నిజాంసాగర్ (ఎల్లారెడ్డి), వెలుగు: కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాతీయ రాజకీయాల్లోకి  వస్తేనే దేశం బాగుపడుతుందని రాష్ట్ర  రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. మంగళవారం నిజాంసాగర్ మండల కేంద్రంలో 140 మంది లబ్ధిదారులకు దళిత బంధు యూనిట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి వేములతో పాటు మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ బీబీ పాటిల్ చీఫ్‌‌‌‌‌‌‌‌గెస్ట్‌‌‌‌‌‌‌‌లుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితుల దశాదిశ మార్చేందుకే సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చరన్నారు. టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ సర్కారు అధికారంలోకి వచ్చాక తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతుందన్నారు. దళిత బంధు యూనిట్ల సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని లబ్ధిదారులకు సూచించారు. అనంతరం దళిత బంధు స్కీమ్‌‌‌‌‌‌‌‌ యూనిట్ల పర్యవేక్షణపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ శోభ, ఎమ్మెల్యే హన్మంత్ షిండే, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్, అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్ వెంకటేశ్‌‌‌‌‌‌‌‌ దోత్రే, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ సెక్రటరీ విజయ్ కుమార్, ఈడీ దయానంద్, ఎంపీపీ జ్యోతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.  

రోడ్ల అభివృద్ధిపై స్పెషల్‌‌‌‌‌‌‌‌ ఫోకస్‌‌‌‌‌‌‌‌

నిజామాబాద్, వెలుగు: పట్టణ ప్రగతి నిధులతో నగరాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు మేయర్ నీతూ కిరణ్ చెప్పారు. నగరంలో 20వ డివిజన్‌‌‌‌‌‌‌‌లో ఏళ్లమ్మగుట్టలో రూ.10 లక్షలతో  చేపతున్న సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్ న్యాలం రాజుతో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ నగరంలోని రోడ్ల అభివృద్ధిపై స్పెషల్‌‌‌‌‌‌‌‌ ఫోకస్ పెట్టినట్టు చెప్పారు. కార్యక్రమంలో కాలనీ వాసులు యెండల సురేశ్‌‌‌‌‌‌‌‌, ఓం ప్రకాష్, కార్తీక్, లక్ష్మణ్, మసూద్, రవి పాల్గొన్నారు.

కేంద్ర పథకాలతో పేదలకు మేలు

నందిపేట, వెలుగు: ​కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉజ్వల గ్యాస్, సుకన్య సమృద్ధి యోజన, ముద్ర లోన్,​ ఫసల్​బీమా వంటి పథకాలతో పేదలకు ఎంతో మేలు జరుగుతుందని కిసాన్​మోర్చా జిల్లా అధ్యక్షుడు నూతుల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. మంగళవారం మండలంలోని వెల్మల్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏక కాలంలో రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పిందన్నారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారంలోకి 8 ఏళ్లు గడుస్తున్నా మండలానికి ఒక్క డబుల్​బెడ్ రూం ఇల్లు మంజూరు చేయలేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇ చ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కిసాన్​మోర్చా మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, తారక్, ప్రవీణ్, వంశీ, మహేశ్‌‌‌‌‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు.

బతుకమ్మ చీరలు కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కానుక

ఆర్మూర్, వెలుగు: బతుకమ్మ చీరలు తెలంగాణ ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తున్న కానుక అని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆర్మూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బతుకమ్మ చీరలు, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలోనే ఆర్మూర్ అభివృద్ధి చెందిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్, జడ్పీటీసీలు మెట్టు సంతోష్, ఎర్రం యమున, ఎంపీపీలు పస్క నర్సయ్య, వాకిడి సంతోష్, మాస్త ప్రభాకర్ పాల్గొన్నారు.

కేసీఆర్ పాలనపై పోరాడండి

నిజామాబాద్, వెలుగు: కొండా లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌ బాపూజీ స్ఫూర్తితో కేసీఆర్ నియంత పాలనపై ప్రజలు పోరాడాలని బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ బస్వా లక్ష్మీనర్సయ్య పిలుపునిచ్చారు. లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌ బాపూజీ జయంతి సందర్భంగా ఇందూరు వినాయక్ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఆయన విగ్రహానికి బీజేపీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మీనర్సయ్య మాట్లాడుతూ అప్పుడు నిజాం నిరంకుశ పాలనతో ప్రజలను హింసించాడని, ఇప్పుడు కేసీఆర్ నియంత పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని అన్నారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ప్రతీ ఒక్కరు తిరుగుబాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు న్యాలం రాజు, పోతన్‌‌‌‌‌‌‌‌కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లక్ష్మీనారాయణ, స్వామియాదవ్, రాజశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, శ్రీనివాస్, కిషన్, గిరిబాబు, రాకేశ్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

రైతుల అభివృద్ధే లక్ష్యం

భిక్కనూరు, వెలుగు: రైతుల అభివృద్ధే లక్ష్యంగా సింగిల్​విండోలు పని చేస్తున్నాయని అంతంపల్లి విండో చైర్మన్ వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. మంగళవారం ఏర్పాటు చేసిన 57వ మహాజన సభలో మాట్లాడుతూ విండోలో సభ్యత్వం పొందిన ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్​ చేయించుకోవాలని సూచించారు. సభలో ఏక కాలంలో రుణమాఫీ, వాన కాలం వడ్లతో పాటు ఇతర పంటలను ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేయాలని, రైతులకు అన్ని రకాల క్రాప్ లోన్స్‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలని తీర్మానించారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్టెడి భగవంతరెడ్డి, సర్పంచ్​ మాధమోహన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, లక్ష్మీదేవునిపల్లి సర్పంచ్ సుమలత, ఎంపీటీసీలు, విండో డైరెక్టర్లు  పాల్గొన్నారు. 

ధరణి పేరుతో రైతులను పీడిస్తున్నరు

కామారెడ్డి, వెలుగు: ధరణి పేరుతో కేసీఆర్ సర్కారు రైతులను పీడిస్తోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. ధరణిలో రైతుల గోస, భూ అక్రమ దందాలపై కలెక్టర్ స్పందించాలని డిమాండ్​ చేస్తూ బీజేపీ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి మంగళవారం అమరణ నిరహార దీక్ష చేపట్టగా ఆయనను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పి రామారెడ్డి పీఎస్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. పీఎస్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఆయనను ఎంపీ కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే దీక్ష చేస్తే అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ధరణిని అడ్డం పెట్టుకుని కల్వకుంట్ల ఫ్యామిలీ స్కామ్‌‌‌‌‌‌‌‌లు చేస్తుందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాగానే ధరణిని ప్రక్షాళన చేస్తామని చెపారు. పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకుని ప్రతిపక్ష పార్టీలను తొక్కాలని కేసీఆర్ చూస్తున్నారన్నారు. పోలీసు వ్యవస్థల్లో పైస్థాయి ఆఫీసర్లు మాత్రమే ఆయనకు మద్దతుగా ఉన్నారని, మిగతా వారంతా సీఎంను తిట్టేవారే ఉన్నారన్నారు. అదే పోలీసులతో  కల్వకుంట్ల ఫ్యామిలీని అరెస్టు చేయడం ఖాయమన్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడం డబుల్​ బెడ్ రూం ఇండ్ల లెక్కనే ఉందన్నారు. జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్న ఈ ప్రభుత్వం గిరిజన, దళిత బంధు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కాళేశ్వరం, మిషన్​ భగీరథ, మిషన్​కాకతీయలో  రూ2.50 లక్షల కోట్లు మింగారని ఆరోపించారు. గిరిజనుల అభివృద్ధి కోసం ఇచ్చిన ఫండ్స్​ కూడా దారి మళ్లీంచారన్నారు. వరదలతో పంట నష్టపోయిన రైతులకు నయాపైసా ఇవ్వలేదన్నారు.    

వడ్ల కొనుగోలుపై టెన్షన్‌‌ వద్దు
స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి

కోటగిరి/వర్ని, వెలుగు: వడ్ల సీజన్ వస్తున్నందున కొందరు రైతుల్లో లేనిపోని భయాన్ని సృష్టిస్తున్నారని, కొనుగోలు విషయంలో రైతులు టెన్షన్‌‌ పడొద్దని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కోటగిరి, రుద్రూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంగళవారం నిర్వహించిన బతుకమ్మ చీరలు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన చీఫ్ గెస్ట్‌‌‌‌‌‌‌‌గా హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందన్నారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఒంటరి మహిళలకు పెన్షన్, బీడీ కార్మికుల పెన్షన్ స్కీంలు  అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఆడ పిల్ల పుడితే రూ.13 వేల ఆర్థిక సాయం ఇస్తున్నది కేవలం కేసీఆర్ ప్రభుత్వమని చెప్పారు. మహిళల పండుగ అయిన బతుకమ్మను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. ఆడపడుచుకి ఓ అన్నలా కేసీఆర్ చీరెలు కానుకగా ఇస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ వల్లేపల్లి సునీత్, జడ్పీటీసీ శంకర్ పటేల్, వైస్ ఎంపీపీ గంగాధర్, ఆర్డీవో రాజేశ్వర్, సర్పంచ్ పత్తి లక్ష్మణ్, ఏఎంసీ చైర్మన్ లావణ్య, మండల టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడు ఎజాస్​ ఖాన్, సొసైటీ చైర్మన్ కూచి సిద్ధు పాల్గొన్నారు. రుద్రూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన కార్యక్రమంలో బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, ఏసీపీ కిరణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎంపీపీ అక్కపల్లి సుజాత నాగేందర్, జడ్పీటీసీ నారోజి గంగారాం, సర్పంచ్ చంద్రశేఖర్, వైస్ ఎంపీపీ సాయిలు, తహసీల్దార్ ముజీబ్ తదితరులు పాల్గొన్నారు.

నేడు కామారెడ్డికి వివేక్ వెంకటస్వామి 

కామారెడ్డి, వెలుగు: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్​ వెంకటస్వామి నేడు కామారెడ్డికి వస్తున్నారు. ధరణితో రైతుల గోసపై బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపేందుకు ఆయన ఇక్కడకు వస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 

పద్మశాలి సంఘం పట్టణ  కార్యవర్గం ఎన్నిక

నిజామాబాద్ టౌన్, వెలుగు: పట్టణ పద్మశాలి సంఘానికి జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా గుజ్జేటి వెంకట నరసయ్య, ప్రధాన కార్యదర్శిగా ఎనుగందుల మురళి ఎన్నికయ్యారు. కోశాధికారిగా కైరంకొండ విఠల్, ఉపాధ్యక్షులుగా గెంట్యాల వెంకటనరసయ్య, అవధూత దశరథం, సహాయ కార్యదర్శులుగా బింగి మోహన్, దాసరి గుండయ్యలు ఎన్నికయ్యారు.

కామారెడ్డి డిగ్రీ కాలేజీకి న్యాక్ ఏ గ్రేడ్​

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీకి న్యాక్ ఏ గ్రేడ్ గుర్తింపు వచ్చింది. ఇటీవల న్యాక్ టీమ్ కాలేజీని విజిట్ చేసింది. రెండు రోజుల పాటు కాలేజీకి సంబంధించిన అన్ని విభాగాలను టీమ్ సభ్యులు పరిశీలించారు. న్యాక్ టీమ్ 3.22 మార్కులతో ఏ గ్రేడ్ సాధించటంపై కాలేజీ ప్రిన్సిపాల్ కిష్టయ్య, లెక్చరర్లు సంతోషం వ్యక్తం చేశారు.