Viral Video: విడాకులకోసం కోర్టుకెక్కిన జంట..పాటపాడిన భర్త.. తర్వాత ఏంజరిగిందంటే..

Viral Video: విడాకులకోసం కోర్టుకెక్కిన జంట..పాటపాడిన భర్త.. తర్వాత ఏంజరిగిందంటే..

మూడు ముళ్ల బంధం చాలా గొప్పది అంటుంటారు. మూడు ముళ్లతో ఏకమైన యువతీ, యువకులు జీవిత కాలం కలిసి ఉండాలి. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి అని పెళ్లినాటి ప్రమాణాలు చేసుకుంటారు. ఇక సంసారం సాగుతున్న క్రమంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు కామన్.. గతంలో గొడవపడితే కాంప్రమైజ్ అయ్యే గుణం భార్యభర్తల్లో ఉండేది. గొడవపడ్డా రాజీపడి యథావిధిగా జీవితం కొనసాగించేవాళ్లు. పిల్లలకోసం వారి భవిష్యత్తుకోసం ఇంట్లో ఎన్ని గొడవలు జరిగినా బయటికి వచ్చేవి కావు. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. ఇప్పటి పరిస్థితుల్లో భార్యభర్తల్లో రాజీపడే తత్వం చాలా తక్కువ.. ఈగోలకు పోతున్నారు. ఒకరిమీద ఒకరు పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న గొడవలు కాస్త పెరిగి నువ్వెంత అంటే నువ్వెంత అని.. చిన్న చిన్న విషయాలకే కోర్టులు, విడాకులు అంటూ లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు. అయితే విడాకులకోసం కోర్టుకు వచ్చిన ఓ జంట..జడ్జి ముందు కాంప్రమైజ్ అయిన తీరు.. దానికి సంభంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.   

పాటపాడిన భర్త.. కాంప్రమైజ్ అయిన భార్య

భార్యభర్తల మధ్య చిన్న చిన్న గొడవలతో కోర్టుకెక్కిన ఓ జంట. విచారణలో భర్త తనను సరిగా చూసుకోవడం లేదని కోర్టులో న్యాయమూర్తికి చెప్పింది భార్య. అయితే ఆమె మాటల్లో భర్తపై ప్రేమ ఉన్నట్లు గమనించాడు. డివోర్స్ కు అప్లయ్ చేసినా భార్తతో కలిసుండాలని ఆలోచన ఉన్నట్లు తెలుసుకున్నాడు. ఎలాగైన వారిని కలపాలని భావించారు. వారిద్దరికి సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. అదేసమయంలో ఆమె భర్త మంచి సింగర్ అని జడ్జ్ తెలుసుకున్నారు. అతడిని పాటపాడమని జడ్జి ఆదేశించారు. వెంటనే అతను బద్లాపూర్ సినిమాలో జీనాజీనా పాటను అందుకున్నాడు. దీంతో అతని భార్య కరిగిపోయిన భార్య.. భర్త భూజంపై వాలిపోయింది. ఇంకేముంది జడ్జి అనుకున్నది ఫలించింది. అక్కడున్న వారంతా ఆ జంటను చప్పట్లతో అభినందించారు. జీవితంలో మళ్లీ గొడవపడకుండా కలిసుండాలని దీవించారు. 

అయితే ఈ వీడియో షేర్ అయిన వెంటనే ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేయడం ప్రారంభించింది. చాలా హాస్యాస్పదం అనిపించింది అని ఓ నెటిజన్ రాశారు. ఇది నకిలీదై ఉండొచ్చని మరో నెటిజన్ స్పందించాడు. ఇక ఓ నెటిజన్ కొంచెం ముందడుగేసి..  ఛాహెల్ కూడా పాటలు నేర్చుకుని పాడి ఉండే విడాకులు తప్పేవి అని పోస్ట్ చేశారు. అతను ఇంతకుముందే ఇలా చేసి ఉంటే బాగుండేది అని ఒకరు.. కోర్డు భరణం ఇప్పించలేమని చెప్పిండొచ్చు అందుకే ఆమె కాంప్రమైజ్ అయిందని మరొకరు.. అబ్బాయిలు మీరు తప్పకుండా పాటలు పాడటం నేర్చుకోవాలని ఇంకొందరు కామెంట్స్ చేశారు.