హెడ్‌‌‌‌‌‌‌‌ఫోన్స్‌‌‌‌‌‌‌‌ డెలివరీ బిజినెస్ పేరిట రూ.229 కోట్ల మోసం

హెడ్‌‌‌‌‌‌‌‌ఫోన్స్‌‌‌‌‌‌‌‌ డెలివరీ బిజినెస్ పేరిట రూ.229 కోట్ల మోసం
  • ఇన్వెస్ట్​మెంట్ పేరుతో 17,500 మంది నుంచి 
  • వసూలు చేసిన డీకేజెడ్‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీస్‌‌‌‌‌‌‌‌, డికాజో సొల్యూషన్స్
  • అమెజాన్‌‌‌‌‌‌‌‌లో బోల్ట్‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌ఫోన్స్ డెలివరీ చేస్తామని ప్రచారం
  • ఆగస్టులో బిచాణా ఎత్తేసిన కంపెనీలు
  • రూ.2.74 కోట్లు డిపాజిట్ చేసిన ఓ డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • బాధితుడి ఫిర్యాదుతో ఎండీ, డైరెక్టర్​ల అరెస్టు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ కు సంబంధించి మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ కామర్స్‌‌‌‌‌‌‌‌ సైట్‌‌‌‌‌‌‌‌ అమెజాన్‌‌‌‌‌‌‌‌లో హెడ్‌‌‌‌‌‌‌‌ఫోన్స్‌‌‌‌‌‌‌‌, నెక్‌‌‌‌‌‌‌‌ బ్యాండ్స్‌‌‌‌‌‌‌‌ మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నామంటూ 17,500 మంది నుంచి రూ.229 కోట్లు వసూలు చేసిన గ్యాంగ్‌‌‌‌‌‌‌‌ను హైదరాబాద్ సీసీఎస్‌‌‌‌‌‌‌‌ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.

మాదాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేంద్రంగా నిర్వహిస్తున్న డీకేజెడ్ టెక్నాలజీస్‌‌‌‌‌‌‌‌లో సోదాలు నిర్వహించారు. రూ.1.7 కోట్ల నగదు 564 గ్యారంటీ అగ్రిమెంట్‌‌‌‌‌‌‌‌ బాండ్స్, 13 ల్యాప్‌‌‌‌‌‌‌‌టాప్స్‌‌‌‌‌‌‌‌, వివిధ బ్యాంకులకు చెందిన చెక్‌‌‌‌‌‌‌‌బుక్స్‌‌‌‌‌‌‌‌, ఏజెంట్స్‌‌‌‌‌‌‌‌, క్లయింట్స్‌‌‌‌‌‌‌‌ పేర్లతో ఉన్న
రికార్డులను సీజ్ చేశారు.

హెడ్‌‌‌‌‌‌‌‌ఫోన్స్‌‌‌‌‌‌‌‌, నెక్‌‌‌‌‌‌‌‌బ్యాండ్స్ డెలివరీ పేరుతో మస్కా మాదాపూర్ కేంద్రంగా డీకేజెడ్‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీస్‌‌‌‌‌‌‌‌, డికాజో సొల్యూషన్స్‌‌‌‌‌‌‌‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. సంస్థ ఎండీగా సయ్యద్ అష్ఫక్ రాహిల్‌‌‌‌‌‌‌‌, డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అతని భార్య సయ్యద్ ఐషా నాజ్‌‌‌‌‌‌‌‌ వ్యవహరిస్తున్నారు.‌‌‌‌‌‌‌‌ బోల్ట్‌‌‌‌‌‌‌‌ కంపెనీకి చెందిన హెడ్‌‌‌‌‌‌‌‌ఫోన్స్‌‌‌‌‌‌‌‌, నెక్‌‌‌‌‌‌‌‌బ్యాండ్స్ ఇతర ఎలక్ట్రానిక్‌‌‌‌‌‌‌‌ పరికరాలను ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ మార్కెంటింగ్ చేస్తున్నట్లు ప్రచారం చేశారు.

ఆకర్షించే విధంగా యూట్యూబ్‌‌‌‌‌‌‌‌లో ప్రమోషన్స్ చేశారు. తమ సంస్థ అమెజాన్ ఈ కామర్స్‌‌‌‌‌‌‌‌తో కలిసి బోల్ట్‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌ఫోన్స్‌‌‌‌‌‌‌‌, నెక్‌‌‌‌‌‌‌‌బ్యాండ్స్ డెలివరీ చేస్తున్నట్లు ప్రకటనలు చేశారు. బి2బి, బి2సి బిజినెస్‌‌‌‌‌‌‌‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చాదర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ఘాట్‌‌‌‌‌‌‌‌, టోలిచౌకిలో తమ స్టోర్స్‌‌‌‌‌‌‌‌ ఉన్నట్లు ప్రచారం చేశారు.

అమెజాన్‌‌‌‌‌‌‌‌లో డెలివరీస్‌‌‌‌‌‌‌‌ పేరుతో డిపాజిట్లు

అమెజాన్‌‌‌‌‌‌‌‌ ద్వారా ప్రతి రోజు 4,000 ఆర్డర్స్‌‌‌‌‌‌‌‌ డెలివరీ చేస్తున్నట్లు తెలిపారు. రూ.5,000 అంతకు మించి డిపాజిట్స్ చేసి తమ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్స్‌‌‌‌‌‌‌‌గా చేరాలని తెలిపారు. పెట్టుబడిలో 8 శాతం నుంచి 12శాతం వరకు వడ్డీ ఇస్తామని నమ్మించారు. యూట్యూబ్‌‌‌‌‌‌‌‌లో ప్రకటనలు చూసి మెహిదీపట్నం గుడిమల్కాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన డాక్టర్‌‌‌‌‌‌‌‌ అబ్దుల్‌‌‌‌‌‌‌‌ జైష్‌‌‌‌‌‌‌‌ ఆకర్షితుడు అయ్యాడు.

డీకేజెడ్‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీస్‌‌‌‌‌‌‌‌, డికాజో సొల్యూషన్స్‌‌‌‌‌‌‌‌ లో ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌  చేసేందుకు సంస్థ నిర్వాహకులు అష్ఫక్‌‌‌‌‌‌‌‌ రాహిల్‌‌‌‌‌‌‌‌, మహ్మద్‌‌‌‌‌‌‌‌ ఇక్బాల్‌‌‌‌‌‌‌‌, సయ్యద్‌‌‌‌‌‌‌‌ ఉమర్ అహ్మద్‌‌‌‌‌‌‌‌, మొయిజ్‌‌‌‌‌‌‌‌, నజీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బిలాల్‌‌‌‌‌‌‌‌ ను పలుమార్లు కలిశాడు. రూ.2.74 కోట్లు డిపాజిట్ చేశాడు. ఇలా పార్ట్‌‌‌‌‌‌‌‌నర్ షిప్‌‌‌‌‌‌‌‌ పేరుతో మొత్తం 17,500 మంది వద్ద డీకేజెడ్‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీస్‌‌‌‌‌‌‌‌, డికాజో సొల్యూషన్స్‌‌‌‌‌‌‌‌ రూ.229 కోట్లు సేకరించింది.

ఆగస్ట్‌‌‌‌‌‌‌‌లో బిచానా ఎత్తివేసింది

మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌ చేయకుండానే ప్రమోషన్స్ నిర్వహించింది. డిపాజిటర్లకు డబ్బులు చెల్లించకుండా కాలం గడిపింది. ఆగస్టులో సంస్థను మూసివేసింది. అబ్దుల్‌‌‌‌‌‌‌‌ జైష్‌‌‌‌‌‌‌‌ తాను మోసపోయానని గుర్తించాడు. గత నెల 4న సిటీ సెంట్రల్ క్రైమ్‌‌‌‌‌‌‌‌ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేశారు. మూడు స్పెషల్ టీమ్స్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసి సోదాలు చేశారు. ఎండీ సయ్యద్ అష్ఫక్ రాహిల్‌‌‌‌‌‌‌‌, డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ సయ్యద్ ఐషా నాజ్‌‌‌‌‌‌‌‌ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మహ్మద్‌‌‌‌‌‌‌‌ ఇక్బాల్‌‌‌‌‌‌‌‌, సయ్యద్‌‌‌‌‌‌‌‌ ఉమర్ అహ్మద్‌‌‌‌‌‌‌‌, మొయిజ్‌‌‌‌‌‌‌‌, నజీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బిలాల్‌‌‌‌‌‌‌‌ కోసం గాలిస్తున్నారు.