గచ్చిబౌలి, వెలుగు: తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే 13 నెలల్లో భారీగా రిటర్న్స్, ల్యాండ్ రిజిస్ర్టేషన్ చేస్తామని చెప్పి బాధితుల నుంచి రూ.కోటి వసూలు చేసిన భార్యాభర్తలను సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్అధికారులు అరెస్ట్ చేశారు. ఈఓడబ్ల్యూ డీసీపీ ప్రసాద్ వివరాల ప్రకారం.. గచ్చిబౌలిలోని గోపన్‌పల్లికి చెందిన జూలపల్లి చంద్రశేఖర్(47), సునీత(44) భార్యాభర్తలు. మాదాపూర్‌లో అమెకాన్ డెవలపర్స్పేరుతో కంపెనీ ప్రారంభించారు.
కంపెనీకి చంద్రశేఖర్ఎండీ అండ్సీఈఓగా, అతని భార్య డైరెక్టర్‌గా ఉన్నారు. తమ కంపెనీలో పెట్టుబడుల పెడితే పెద్ద మొత్తంలో రిటర్న్ ఇస్తామని ప్రకటనలు చేశారు. కూకట్‌పల్లికి చెందిన చక్క సుధీర్ అమెకాన్ డెవలపర్స్‌లో రూ. 60 లక్షలు పెట్టుబడిగా డిపాజిట్చేశాడు. సుధీర్‌తో పాటు ప్రణయ్ రూ. 16.89 లక్షలు, వైదేహి రూ. 25 లక్షలు అమెకాన్ డెవలపర్స్‌లో పెట్టుబడి పెట్టారు. గడువు ముగుస్తున్న పెట్టుబడిగా పెట్టిన డబ్బులకు రిటర్న్స్ఇవ్వకపోవడంతో, అధికారులకు కంప్లైంట్ చేశాడు.
కేసు నమోదు చేసుకున్న ఈవోడబ్ల్యూ అధికారులు చంద్రశేఖర్, సునీత దంపతులను గచ్చిబౌలిలోని గోపన్‌పల్లి వద్ద బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరో నిందితుడు శశికాంత్‌ను అరెస్టు చేయాల్సి ఉందని డీసీపీ తెలిపారు.