ఐస్ క్రీమ్ కరిగిపోయిందని దాడి .. షాపు ఓనర్ ఫిర్యాదుతో ఇద్దరు నిందితులపై కేసు

ఐస్ క్రీమ్ కరిగిపోయిందని దాడి .. షాపు ఓనర్ ఫిర్యాదుతో ఇద్దరు నిందితులపై కేసు

ఘట్​కేసర్, వెలుగు: కరిగిన ఐస్ క్రీమ్ ఇచ్చారని ఓ షాపు ఓనర్​తో పాటు అతని భార్యపై ఇద్దరు నిందితులు దాడి చేశారు. సీఐ పరుశురామ్​ తెలిపిన  ప్రకారం.. రాజస్థాన్​కు చెందిన పప్పు రామ్, శైలు కుమావత్ దంపతులు తమ పిల్లలతో కలిసి ఘట్​కేసర్ మున్సిపాలిటీ అంకుషాపూర్  లో ఉంటూ కిరాణ షాప్  నిర్వహిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం స్థానికుడు మచ్చ రాజశేఖర్ వీరి షాప్ కు  వెళ్లి, రూ.20తో రెండు ఐస్​క్రీమ్ కొనుగోలు చేశాడు. గంట తర్వాత మళ్లీ వెళ్లి ఐస్​క్రీమ్​లు కరిగిపోయాయని, క్వాలిటీ లేనివి ఇచ్చారని వాగ్వాదానికి దిగాడు. 

తిరిగి సాయంత్రం తన సోదరుడు విశాల్​తో కలిసి మళ్లీ షాప్ కు  వెళ్లి  పప్పు రామ్, అతని భార్య శైలుపై దాడి చేసి అసభ్యకరంగా దూషించారు. ఈ దాడిలో పప్పు రామ్ పాపకు కూడా గాయాలు కాగా, షాపులోని సామగ్రి ధ్వంసమైంది. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదుతో నిందితులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.