పిల్లలు పుట్టలేదని దంపతులు ఆత్మహత్యాయత్నం

నర్సాపూర్, వెలుగు: పెండ్లయి ఏడేండ్లవుతున్నా పిల్లలు పుట్టడం లేదని వారం రోజుల కింద భార్యాభర్తలు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా చికిత్స పొందుతూ సోమవారం చనిపోయారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం అహ్మద్ నగర్ గ్రామానికి చెందిన నీరుడి లక్ష్మణ్ (30), రాణి (27) దంపతులు వారం క్రితం ఇంట్లో గడ్డి మందు తాగారు. కుటుంబసభ్యులు హైదరాబాద్​లోని గాంధీ దవాఖానకు తర లించారు.

ALSO READ :గంజాయి మత్తులో దాడులు..!  ‌‌హత్యలు చేసేందుకూ వెనుకాడని మత్తుబాబులు

అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఏజీ ప్రైవేట్ దవాఖానకు తీసుకువెళ్లారు. చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి లక్ష్మణ్ చనిపోగా, సోమవారం తెల్లవారుజామున రాణి చనిపోయింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు.