అప్పుడప్పుడు అడవి జంతువులు గ్రామాల్లోకి వస్తుంటాయి. ముఖ్యంగా పులులు, చిరుత పులులు ఊళ్లలోకి వస్తుంటాయి. ఇదంతా అడవులను ఆనుకుని ఉన్న గ్రామాలకు కామన్. కానీ అవి ఇళ్లలోకి ప్రవేశిస్తే.. ఏముంది.. వణికిపోవడమే. తాజాగా రాజస్థాన్ లోని ఓ హోటల్లోకి చిరుత పులి పిల్ల వచ్చింది. గురువారం (జనవరి 18) జైపూర్ లోని హెరిటేజ్ హోటల్‌లో సిబ్బంది గదిలోకి వెళ్లిన చిరుతపులిని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు
మనదేశంలో పర్యాటకులు సందర్శించడానికి ఎక్కువగా ఇష్టపడే ప్రదేశాలలో రాజస్తాన్ రాజధాని జైపూర్ ఒకటి. విదేశీ పర్యాటకులు సైతం ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ప్రతి సంవత్సరం వచ్చే లక్షల మంది పర్యాటకులతో ఇక్కడి హోటళ్లలో సందడి ఉంటుంది. పర్యాటకులకు వారి బడ్జెట్ ప్రకారం రూమ్ లు దొరుకుతుంటాయి. జైపూర్ పర్యటనలో ఉన్న ఓ కపుల్ కి చేదు అనుభవం ఎదురైంది. అర్థరాత్రి హోటల్ గదిలోకి చిరుత ప్రవేశించడంతో ఆ కపుల్ హోటల్ రూమ్ నుంచి పరుగులు పెట్టారు. దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను కావేరి అనే యువతి ఎక్స్ లో పోస్ట్ చేశారు. డ్రైవర్ రతన్ సింగ్ గది లోకి చిరుత పులి పిల్ల దూరిందని పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 17 వేల మంది చూశారు.
జైపూర్ లోని కనోటా ప్రాంతంలోని ఓయో హోటల్ లో ఓ జంట రూమ్ బుక్ చేసుకుంది. ఉదయమంతా తిరిగి అలిసిపోయి రాత్రి పూట నిద్రించేందుకు ఆ కపుల్ రూమ్ కు చేరుకున్నారు. అయితే తమ గది లాక్ చేసుకొని హాయిగా నిద్రపోతున్న దంపతులకు ఊహించని అనుభవం ఎదురైంది. కిటికీలో నుంచి ఓ చిరుత మెల్లిగా దంపతులు ఉన్న గదిలోకి ప్రవేశించింది. ఏదో శబ్దం అయినట్లు అనిపించడంతో ఆ దంపతులు లైట్లు ఆన్ చేశారు. గదిలో ఎవరో ఉన్నారని అనిపించి చూడగా..ఎదురుగా చిరుతపులి..దీంతో ఒక్కసారిగా వాళ్ల గొంతులో మాట పడిపోయింది. భయాందోళనకు గురైన ఆ దంపతులు వెంటనే బయటకి పరుగులు పెట్టారు. రిసెప్షన్ కి వెళ్లి కంప్లెయింట్ చేయగా మొదట్లో వాళ్లు చెప్పిన మాటలు ఎవరూ నమ్మలేదు. అయితే కిటికీలోంచి చూడగా అక్కడ చిరుతపులి కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు.
రెస్క్యూ ఆపరేషన్
గదిలో చిరుతపులి ఉందన్న సమాచారాన్ని అధికారులకు అందించారు. వెంటనే జంతు సంరక్షణ బృందాన్ని అక్కడికి రప్పించారు. రెస్క్యూ టీమ్ వచ్చే వరకు హోటల్ సిబ్బంది గది తలుపులు మూసి ఉంచారు. రెస్క్యూ టీం తొలుత కిటికీలోంచి చిరుతను అదుపు చేసేందుకు ప్రయత్నించింది. కిటికీలోంచి ఇంజెక్షన్‌తోచిరుతపులిని అపస్మారక స్థితిలోకి పంపారు. అది మత్తులోకి జారుకున్న తర్వాత గది తలుపులు తెరిచి దాన్ని బంధించి తీసుకెళ్లారు.