
- ఇద్దరు పిల్లలకు ఉరి వేసి.. దంపతుల ఆత్మహత్య
- వేర్వేరు రూమ్స్‌లో ఉరేసుకొనిభార్యాభర్తల బలవన్మరణం
- ఆర్థిక ఇబ్బందులతోనే చనిపోతున్నట్టు సూసైడ్ నోట్
ఓయూ, వెలుగు: హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లలకు ఉరి వేసి చంపి, తల్లిదండ్రులు కూడా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌కు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి(44), కవిత(35) దంపతులు. వీళ్లకు కూతురు శ్రీతారెడ్డి(13), కొడుకు విశ్వంత్ రెడ్డి(10) ఉన్నారు. 8 నెలల కింద ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్‌కు వచ్చిన చంద్రశేఖర్‌రెడ్డి.. హబ్సిగూడ పరిధిలోని రవీంద్రనగర్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఆయన బిడ్డ శ్రీతారెడ్డి 9వ తరగతి, కొడుకు విశ్వంత్ రెడ్డి 5వ తరగతి చదువుతున్నారు.
ఓ ప్రైవేట్‌కాలేజీలో జూనియర్లెక్చరర్గా పనిచేసిన చంద్రశేఖర్‌రెడ్డి.. ఆరు నెలల కింద జాబ్మానేశాడు. అప్పటి నుంచి ఖాళీగా ఉండడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దీంతో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సోమవారం రాత్రి పిల్లలకు ఉరి వేసి చంపేశారు. ఆ తర్వాత వేర్వేరు రూమ్స్‌లో చంద్రశేఖర్, కవిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. రెండు సూసైడ్నోట్లు లభ్యమైనట్టు సీఐ రాజేంద్రనాయక్తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యచేసుకుంటున్నట్టు వాటిల్లో రాసి ఉందని ఆయన తెలిపారు.