హైదరాబాద్ లంగర్ హౌస్ లో కారు బీభత్సం సృష్టించింది. టూ వీలర్ తో పాటు ఆటోను కారు ఢీ కొట్టింది. దీంతో బైక్ పై ఉన్న దంపతులు స్పాట్ లోనే చనిపోయారు. ఆటోలో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి.
దంపతులు దినేష్ గోస్వామి, మోనా ఠాకూర్ గుర్తించారు. మోనా గర్భవతి అని తెలిసింది. అయితే యాక్సిడెంట్ కు కారణం కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కారు డ్రైవర్ వికారాబాద్ జిల్లాకు చెందిన ప్రణయ్ గా గుర్తించారు. పోలీసులు డెడ్ బాడీలను పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్ కు తరలించారు. గాయపడ్డ వారి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది.