పిల్లలు పట్టించుకోవడంలేదని.. విషం తాగిన దంపతులు

వరంగల్: అందరూ ఉన్నా అనాథలుగా మారామన్న మనస్థాపంతో వరంగల్ జిల్లాలో ఓ వృద్ధ దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. చెన్నారావుపేట మండలం లింగగిరి గ్రామానికి చెందిన నరిగే కొమురయ్య, ఐలమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు.  పిల్లలను పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేశారు  దంపతులు. వయస్సు మీద పడ్డ వీరిని కొడుకు, కుమార్తెలు పట్టించుకోవడం లేదు. కొన్ని నెలల క్రితం ఐలమ్మకు పక్షవాతం వచ్చింది. అయితే తల్లిని చూడడానికి కూడా పిల్లలు రాలేదు. భార్యకు సేవలు చేయడం కొమురయ్యకు భారంగా మారింది. జీవితంపై విరక్తి చెంది దంపతులిద్దరు పొలంలో వేసే  గుళికలు కూల్ డ్రింకులో కలుపుకొని తాగారు. ఇరుగుపొరుగు వారు గమనించి వృద్ధ దంపతులను నర్సంపేట హాస్పిటల్‎కు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందన్నారు డాక్టర్లు.

For More News..

ఎడారి ఊళ్లో ద్రాక్ష పంటలు జోరు

డ్యూటీకి రాకపోతే రూ.300 ఫైన్