మేడ్చల్ జిల్లా: కారులో పెట్రోల్ పోసుకుని, నిప్పంటించుకుని ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న కేసులో చింటూ యాదవ్ (అలియాస్ మహేష్) అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ జంటను బ్లాక్మెయిల్ చేసి, బెదిరింపులకు పాల్పడినట్లు చింటూ యాదవ్పై ఆరోపణలున్నాయి. చింటూ యాదవ్ (అలియాస్ మహేష్) కొర్రేముల మక్తా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం కీసర పోలీసులు అదుపులో చింటూ యాదవ్ ఉన్నాడు. తను ప్రేమించిన అమ్మాయి తరపు బంధువు బ్లాక్మెయిల్చేస్తున్నాడని ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
A Couple died in an accident at Ghanpur Service Road in Ghatkesar.
— Mohammed Baleegh (@MohammedBaleeg2) January 7, 2025
The accident was reportedly caused as part of a Suicide pact between the couple.
One of the deceased was identified as Sri Ram . @TheSiasatDaily #Hyderabad #Ghatkesar pic.twitter.com/HHcXzf4iaW
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో సోమవారం సాయంత్రం ఈ విషాద ఘటన జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం జమీలపేటకు చెందిన పర్వతం శ్రీరామ్ (25) పోచారం మున్సిపాలిటీ పరిధిలోని నారపల్లిలో సైకిల్ షాప్ నిర్వహిస్తున్నాడు. శ్రీరామ్, అతని దుకాణం పక్కన ఉండే ఓ బాలిక ఐదేండ్లుగా ప్రేమించుకుంటున్నారు.
Also Read : ఎక్కడా అప్పు పుట్టక ప్రేమ జంట ఆత్మహత్య
వీరి ప్రేమ వ్యవహారం బాలిక దగ్గరి బంధువు చింటూకు తెలిసింది. అడిగినన్ని డబ్బులు ఇవ్వకపోతే ఇద్దరి ప్రేమ విషయం ఇంట్లో చెబుతానని బాలికను చింటూ 15 రోజులుగా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఆమె శ్రీరామ్కు చెప్పడంతో చింటూకు శ్రీరామ్ రూ.1.35 లక్షలు ఇచ్చాడు. మరిన్ని డబ్బులు కావాలని బెదిరిస్తుండడంతో డబ్బు ఇచ్చేందుకు శ్రీరామ్ తీవ్రంగా ప్రయత్నించాడు. ఎక్కడా అప్పు పుట్టకపోవడంతో ఆత్మహత్య చేసుకుందామని ప్రేమికులు నిర్ణయించుకున్నారు. సోమవారంఉదయం 10 గంటలకు శ్రీరామ్.. బోడుప్పల్కు చెందిన తన స్నేహితుడు నవీన్ వద్ద కారు తీసుకుని బాలికతో కలిసి వెళ్లాడు. సాయంత్రం ఘనాపూర్ వద్ద ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు సమీపంలో కారులో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు.
కారులో మంటలకు తాళలేక శ్రీరామ్ బయటకు వచ్చి పరిగెత్తాడు. ఫుట్‌పాత్‌పై కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. కారు డోర్ లాక్ కావడంతో బాలిక బయటకు రాలేక అందులోనే సజీవ దహనమైంది. అటువైపు వచ్చిన వాహనదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. చింటూ బ్లాక్మెయిల్ చేయడం వల్లే తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని శ్రీరామ్ అంతకుముందు సూసైడ్ నోట్ రాసి బాలిక తల్లిదండ్రులకు, అతని అన్న కొడుకుకు వాట్సాప్ చేశాడు.