కపుల్ ఫ్రెండ్లీ షూట్ కంప్లీట్

కపుల్ ఫ్రెండ్లీ షూట్ కంప్లీట్

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటిస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ ‘కపుల్ ఫ్రెండ్లీ’. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. సోమవారంతో ఈ మూవీ షూటింగ్ పూర్తయిందని టీమ్ తెలియజేసింది.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌‌, డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయని మేకర్స్ చెప్పారు.  

ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో  రూపొందిస్తున్నామని, ఆడియెన్స్‌‌కు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌‌పీరియెన్స్ ఇస్తుందని అన్నారు. త్వరలోనే రిలీజ్ డేట్‌‌ను ప్రకటిస్తామన్నారు.  ఇప్పటికే రిలీజ్ చేసిన వీడియో గ్లింప్స్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఆదిత్య రవీంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.