భారీ వర్షం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెంలో తీవ్ర విషాదం నింపింది. పాలేరు వాగులో చిక్కుకున్న కుటుంబంలో దంపతులు గల్లంత య్యారు. ప్రవాహంలో కొట్టుకుపోతున్న మరో యువకుడుని స్థానికులు, పోలీసులు రక్షించారు.
లేరు అలుగు సమీపంలో ఉన్న సిమెంటు ఇటుకల తయారీ కర్మాగా రంలో ఓ కుటుంబం నివసిస్తోంది. పాలేరు జలాశయానికి ఆదివారం తెల్లవారుజాము నుంచి వరద పోటెత్తడంతో షేక్ యాకుబ్, భార్య సైదాబి, కుమారుడు షరీఫ్ వరదల్లో చిక్కుకుపోయారు.
వరద ఉద్ధృతి పెరగడంతో ప్రవాహంలో గల్లంతయ్యారు. కొట్టుకుపోతున్న షరీఫ్‌ను స్థానికులు, పోలీసులు కాపాడారు. దంపతుల కోసం గాలింపు కొనసాగుతోంది.
మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండంతో ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయికన్ గూడెం వద్ద ముగ్గురు యువకులు వరదల్లో చిక్కుకున్నారు. సిమెంట్ బ్రిక్స్ తయారీ కేంద్రం ఉన్నా ఇల్లును వరద చుట్టుముట్టడంతో ముగ్గురు యువకులు ఇంటిపైకి ఎక్కారు.
బాధితులతో మాట్లాడిన పొంగులేటి.. వారికి ధైర్యం చెప్పారు. హెలికాప్టర్లు పంపించేందుకు ప్రయత్నించారు.. కానీ వాతావరణ సహకరించకపోవడంతో సాధ్యం కాలేదు.. అయితే డ్రోన్ ద్వారా బాధితులకు సేఫ్టీ జాకెట్లు పంపించారు.
అయితే ఇంతలోనే వరద ఉధృతి పెరిగి ఇంటి గోడ కూలిపోయిందని మంత్రి పొంగులేటి మీడియాతో చెప్పారు.. లైఫ్ జాకెట్లు ఉన్నాయి.. వారు క్షేమంగా బయటికి రావాలని కోరుకుంటున్నానని కంటనీరు పెట్టుకున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.