- ఖమ్మం జిల్లా చెరువు మాదారంలో ఘటన
- దహన సంస్కారాలకు రూ.లక్ష అందజేసిన పొంగులేటి
నేలకొండపల్లి, వెలుగు : రెండు రోజులుగా కురుస్తున్న ముసురుకు ఇంటిగోడ కూలి భార్యాభర్తలు చనిపోయారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువుమాదారంలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నూకతోటి పుల్లారావు(42), లక్ష్మి(38) దంపతులు. వీరికి పిల్లలు లేరు. ఇద్దరూ బుధవారం రాత్రి ఇంట్లో నిద్రపోయారు.
అర్ధరాత్రి ఒక్కసారిగా ఇంటి గోడ కూలి వారిపై పడింది. గోడ కూలిన శబ్దం విన్న స్థానికులు వెంటనే అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే భార్యాభర్తలు చనిపోయారు. తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ బంధువు దయాకర్ రెడ్డితో ఆ కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సాయం అందేలా చేశారు.