హైదరాబాద్‌సిటీ, వెలుగు: ఇంట్లో నమ్మకంగా పనిచేసి రూ.50 లక్షల విలువైన బంగారం, నగదు ఎత్తుకెళ్లిన దంపతులను రాజేంద్రనగర్పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. బండ్లగూడ జాగీరు పరిధిలోని మాపెల్ టౌన్ విల్లా నంబర్ 20లో డాక్టర్ కొండల్‌రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నారు. గత నెలలో ఆయన ఇంట్లో బిహార్‌కు చెందిన నవీన్ కుమార్ యాదవ్, భారతి దంపతులు పనికి కుదిరారు.
అప్పటినుంచి ఇంట్లో ఉన్న బంగారం, నగదుపై కన్నేసిన వీరు.. సోమవారం రాత్రి వాటిని కొట్టేసి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో రాజేంద్రనగర్పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.