కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. డ్రైవర్స్ కాలనీకి చెందిన ఇద్దరు వ్యక్తులను దారుణంగా హత్య చేశారు. ఈ జంట హత్యలు జిల్లా కేంద్రంలో కలకలం సృష్టించాయి. పట్టణ శివారులోని గుమస్తా కాలనీ సమీపంలో శాబ్ధిపూర్ రోడ్డులో గురువారం రాత్రి ఇద్దరు వ్యక్తులు హత్యకు గురయ్యారు. డ్రైవర్స్ కాలనీకి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ వడ్ల సుధాకర్ (45), హమాలీగా పని చేసే కోయల లక్ష్మయ్యలు హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపినట్లుగా భావిస్తున్నారు. ఘటన స్థలంలో ఖాళీ మద్యం సీసా, కల్లు ప్యాకెట్ పడి ఉన్నాయి. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి దర్యాప్తు మొదలు పెట్టారు.
For More News..