- మంత్రి శ్రీనివాస్ గౌడ్ నుంచి ప్రాణహాని
- హెచ్ఆర్సీలో భార్యాభర్తల ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు: మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆయన తమ్ముడు శ్రీకాంత్ గౌడ్‌తో ప్రాణహాని ఉందంటూ మహబూబ్‌నగర్ క్రిస్టియన్‌పల్లికి చెందిన బండేకర్ విశ్వనాథరావు, పుష్పలత దంపతులు బుధవారం హెచ్‌ఆర్సీలో కంప్లైంట్ చేశారు. రూరల్ సీఐ మహేశ్వర్ గౌడ్, ఎస్సై రవిప్రకాష్, మంత్రి తమ్ముడు శ్రీకాంత్‌గౌడ్ అనుచరులతో తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. బాధితుల వివరాల ప్రకారం.. బండేకర్ విశ్వనాథరావు ప్రైవేట్ జాబ్ చేస్తూ సోషల్ యాక్టివిస్ట్‌గా చేస్తున్నారు. 2018 ఎలక్షన్స్ సమయంలో మంత్రిపై నమోదైన కేసులో విశ్వనాథరావు సాక్షిగా ఉన్నారు. దీంతో మంత్రి, ఆయన తమ్ముడు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న తనను, తన భార్యను ఉద్యోగాల నుంచి తీసేయించారని, వేధింపులు మానకుంటే పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు హెచ్చరించారు.