పేరెంట్స్ ని కాదని పెళ్లి చేసుకుంటే..  పోలీస్ ప్రొటెక్షన్ అడిగే హక్కు లేదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

పేరెంట్స్ ని కాదని పెళ్లి చేసుకుంటే..  పోలీస్ ప్రొటెక్షన్ అడిగే హక్కు లేదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకుంటే పోలీస్ ప్రొటెక్షన్ అడిగే హక్కు లేదంటూ సంచలన తీర్పు వెల్లడించింది అలహాబాద్ హైకోర్టు. పోలీస్ ప్రొటెక్షన్ కోసం ఓ జంట దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెల్లడించింది. నిజంగానే ప్రాణహాని ఉంటే తప్ప... పేరెంట్స్ ని కాదని పెళ్లి చేసుకున్నోళ్ళు పోలీస్ ప్రొటెక్షన్ అడిగే హక్కు లేదని తెలిపింది కోర్టు. ప్రొటెక్షన్ తప్పనిసరి అనిపించిన కేసులకు మాత్రమే పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని.. మిగతా జంటలు సమాజాన్ని పేస్ చేసేందుకు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలని పేర్కొంది కోర్టు.

శ్రేయ కేసర్వాని దంపతులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో సీరియస్ థ్రెట్ లేదని..  పోలీస్ ప్రొటెక్షన్ అవసరం లేదని పేర్కొన్న అలహాబాద్ కోర్టు పిటిషన్ ను కొట్టేసింది. తమ ఇష్టానుసారం వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్న జంటలకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ను ఉదాహరణగా పేర్కొంటూ ఈ తీర్పు వెల్లడించింది అలహాబాద్ హైకోర్టు.

తమ ఇష్టానుసారం వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్న జంటలకు ప్రొటెక్షన్ కల్పించడం కోర్టు బాధ్యత కాదని పేర్కొంది ధర్మాసనం. ఒకవేళ ప్రొటెక్షన్ కోరిన జంటకు నిజంగానే లైఫ్ థ్రెట్ ఉందని భావిస్తే.. చట్టానికి లోబడి పోలీసు శాఖ నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది కోర్టు.