
సంగారెడ్డి జిల్లాలో భార్యాభర్తల మిస్సింగ్ కలకలం రేపుతోంది. అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రైడ్ పార్క్ శ్రీకృష్ణసౌధ కాలనీలో నివాసం ఉంటున్న గాజులరామారానికి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి వంశీకృష్ణ, ఆయన భార్య శ్రీలత కనిపించకుండా పోయారు.
గత నెల ఫిబ్రవరి 2వ తేదీన వంశీకృష్ణ.. తన భార్య, కొడుకు కార్తికేయ(10) తీసుకొని ఉద్యోగం వెతకడానికి అని వెళ్లి కనిపించడం లేదంటూ అతని తండ్రి కామేశ్వర్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన అమీన్ పూర్ పోలీసులు.. వారి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.