ఇంటర్నెట్ సౌకర్యం ఉంటే చాలు వెబ్‌సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్స్‌మొదలుకుని టీవీ సీరియల్స్, సినిమాల వరకు ఒక్క క్లిక్‌తోనే డౌన్‌లోడ్ చేసుకుంటున్నాం. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ వంటి వీవోడీ ఫ్లాట్‌ఫాంల ద్వారా ఈ అవకాశం లభిస్తోంది. కరోనా సంక్షోభం వల్లఈ ప్రొవైడర్స్‌కు మరింత డిమాండ్ పెరిగింది. ఈ ఎమర్జింగ్ టెక్నాలజీ రంగంలో కోర్సులు..ఉద్యోగావకాశాలు..ఈ వారం కెరీర్ గైడెన్స్‌లో..
1960–2000.. సాంప్రదాయ టెలివిజన్స్ లో షెడ్యూల్ ప్రకారం సీరియల్స్, షోస్, సినిమాలు చూసే కాలం. 2000 మొదలుకొని నేటివరకు.. వీడియోస్ ఆన్ డిమాండ్/ఓవర్ ద టాప్ మోడల్ టెక్నాలజీ ఎమర్జ్ అవుతున్న టైమ్. ప్రస్తుతం పీక్స్ కి వెళ్తున్న ఇంటర్నెట్ టెక్నాలజీల్లో ఇది ఒకటి. ఇంటర్నెట్ లో మొదట డిజిటల్ కంటెంట్ పూర్తి ఉచితంగా లభిస్తుండగా ప్రస్తుతం టెలివిజన్ నుంచి టాబ్స్ వరకు డిఫరెంట్ సబ్‌స్క్రిప్షన్ మోడల్స్ పుట్టుకొచ్చాయి. కేబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ కి ఆల్టర్‌నేటివ్ గా మారుతున్న డిజిటల్ వీడియో కంటెంట్ ప్రొవైడర్స్ ఇప్పుడు ఆల్టర్‌నేటివ్ కెరీర్స్ హబ్ గానూ నిలుస్తున్నాయి.
కెరీర్ ఆపర్చునిటీస్..
వీడియో ఆన్ డిమాండ్ సొల్యూషన్స్ అండ్ టెక్నాలజీలో ప్రధానంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, సీనియర్/ప్రిన్సిపల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, హెచ్‌ఆర్, సాప్ట్ వేర్ డెవలపర్, ప్రొడక్ట్ మేనేజర్ (సాఫ్ట్‌వేర్), మార్కెటింగ్ కో ఆర్డినేటర్, సేల్స్ ఎగ్జిక్ యూటివ్స్/ఇంజినీర్, మార్కెటింగ్ మేనేజర్ వంటి జాబ్ ప్రొఫైల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రిన్సిపల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కి అత్యధిక శాలరీ అందుతుండగా మార్కెటింగ్ మేనేజర్, సాప్ట్ వేర్ డెవలపర్ కి మంచి వేతనాలు లభిస్తున్నాయి. మీడియా, సాఫ్ట్‌వేర్,మార్కెటింగ్ కంపెనీల్లో ఉండే సాధారణ జాబ్ ప్రొఫైల్సే ఇందులోనూ ఉంటాయి. కాకపోతే ఇండస్ట్రీఅవసరాలకు అనుగుణంగా సంబంధిత నైపుణ్యం ఉండాలి. వీవోడీ సైట్స్ జనరల్ గా ఫిల్మ్ మేకింగ్ కంపెనీలతో టై అప్ అయి కంటెంట్ ను స్ర్టీమ్ చేస్తాయి కానీ ప్రొడ్యూస్ చేయవు. అందుకే తక్కువ సంఖ్యలో ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి.
కోర్సులు
వీవోడీ ఫ్లాట్ ఫామ్స్ లో పనిచేయాలంటే ప్రత్యేకమైన కోర్సులు లేవనే చెప్పవచ్చు. సాధారణంగా మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్, సాఫ్ట్‌వేర్, కంప్యూటర్ సైన్స్, మార్కెటింగ్ కోర్సులు చేసిన వారెవరైనా వీవోడీ/ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో కెరీర్ ప్రారంభించవచ్చు. ఉదాహరణకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ చదివిన వారు ప్రోగ్రామింగ్, కోడింగ్ లాంగ్వేజస్ నేర్చుకొని సాఫ్ట్‌వేర్ డెవలపర్, సాప్ట్ వేర్ ఇంజినీర్ కెరీర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మార్కెటింగ్ లో పీజీ లేదా డిప్లొమా చదివితే మార్కెటింగ్ ఎగ్జిక్ యూటివ్స్ లేదా మేనేజర్లుగా స్థిరపడొచ్చు. హెచ్ఆర్, ఫైనాన్స్ కోర్సులు చదివిన వారు అకౌంట్స్, హెచ్‌ఆర్ డిపార్మట్ ెంట్ లో ప్రవేశించవచ్చు. చాలా ఆన్‌లైన్ వెబ్‌సైట్స్ ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్ లాంగ్వేజస్ లో షార్ట్‌టెర్మ్ అండ్ సర్టిఫిర్టి కెట్ కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. మనదేశంలో ఎన్‌పీటీఈఎల్, స్వయం వంటి వెబ్‌సైట్స్ లో ఐఐటీలు రూపొందించిన కోర్సులున్నాయి. వీటిని పూర్తి ఉచితంగా లేదా నామమాత్రపు ఫీజుతో చదువుకోవచ్చు. కోర్సు పూర్తయ్యాక కొంత మొత్తం చెల్లిం చి టెస్ట్ తీసుకోవడం ద్వారా సర్టిఫిర్టి కెట్ పొందొచ్చు. అలాగే మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్‌ఆర్, వెబ్ డిజైనింగ్, వెబ్ డెవలప్‌మెంట్ వంటి వాటికి కూడా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.