కోర్ట్ ట్రైలర్: విలన్ గా హీరో శివాజీ.. 14 ఏళ్ళు జైలు శిక్ష తప్పదా.?

కోర్ట్ ట్రైలర్: విలన్ గా హీరో శివాజీ.. 14 ఏళ్ళు జైలు శిక్ష తప్పదా.?

టాలీవుడ్ ప్రముఖ హీరో, కమెడియన్ ప్రియదర్శి నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. ఈ సినిమాకి నూతన దర్శకుడు రామ్ జగదీష్ దర్శకత్వం వాహిస్తుండగా వాల్ పోస్టర్ బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. అన్యాయంగా ఓ కేసులో ఇరికించిన ఓ కుర్రాడి కోసం జరిగే న్యాయ పోరాటమే ఈ చిత్ర కథ.  ప్రియదర్శి లాయర్ పాత్రలో నటిస్తున్నాడు.  శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, హర్ష్ రోషన్, శ్రీదేవి కీలక పాత్రలు పోషిస్తున్నారు.శుక్రవారం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.. ఇప్పుడు ఈ ట్రైలర్ విశేషాలేంటో చూద్దాం..

ALSO READ | త్రివిక్రమ్ అల్లు అర్జున్ సినిమా స్టోరీ అదేనా... సైలెంట్ గా మొదలెట్టేశారా.?

మొదటగా చైల్డ్ ఆర్టిస్ట్ హర్ష్ రోషన్ ఓ డబ్బున్న అమ్మాయితో ప్రేమలో పడుతాడు. దీంతో చెట్టాపట్టాలేసుకుని తిరగుతుంటారు. ఈ విషయం కాస్తా అమ్మాయి తండ్రి(శివాజీ)కి తెలుస్తుంది. దీంతో తన పరపతి పలుకుబడి ఉపయోగించి హర్ష్ రోషన్ అరెస్ట్ చేయిస్తాడు.. అలాగే అమ్మాయి మైనర్ కావడంతో హర్ష్ రోషన్ పై పోక్సో యాక్ట్ క్రింద కేసు నమోదు చేయిస్తాడు. శివాజీ మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో ఈ కేసుని వాదించడానికి లాయర్లు ఎవరూ ముందుకు రారు. కానే యంగ్ లాయర్ ప్రియదర్శి ఈ కేసుని ఒప్పుకుంటాడు.. 

ఇంట్రెస్టింగ్ అండ్ క్యూరియాసిటీ వేలో కట్ చేసిన ట్రైలర్ బాగుంది.. అలాగే మైనర్ బాలికలపై లైంగిక నేరాలకి పాల్పడిన వారిపై నమోదు చేసే పోక్సో యాక్ట్ గురించి అవగాహన కల్పించడానికి చేసిన ప్రయత్నం ఫలించిందని చెప్పవచ్చు. ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ సినిమా మార్చ్ 14న ఆడియన్స్ ముందుకు రాబోతోంది.  మరి థియేటర్స్ లో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.