హుజూర్ నగర్, వెలుగు : అక్రమ భూ బదలాయింపు కేసులో అరెస్ట్ అయిన అప్పటి తహసీల్దార్ వజ్రాల జయశ్రీ 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా సబ్ జైలుకు తరలించారు. దర్యాప్తులో భాగంగా 5 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించాలని గురువారం సీఐ చరమంద రాజు పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు తహసీల్దార్ జయశ్రీ న్యాయవాది బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి మారుతీప్రసాద్ తహసీల్దార్ ను శుక్రవారం ఉదయం 8:30 నుంచి సాయంత్రం5 గంటల వరకు విచారించేందుకు పోలీసులకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మూడు రోజుల పాటు న్యాయ స్థానానికి సెలవు కావడంతో ఆమె బెయిల్ పిటిషన్ ను సోమవారానికి వాయిదా వేశారు.