ధర్మారం,వెలుగు : ధర్మారం మండలం నంది మేడారం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బార్ అసోసియేషన్ అభ్యర్థన తో విశాఖ ట్రస్ట్ ద్వారా 30 బెంచీలు కోర్టుకు అందించారు. ట్రస్ట్ ధర్మారం మండల కో ఆర్డినేటర్ కాడే సూర్యనారాయణ, సభ్యులు ఎండీ హఫీజ్ నంది మేడారం కోర్టు వద్ద బార్ అసోసియేషన్ సభ్యులకు బెంచీలు అందజేశారు. అశోక్ రెడ్డి మాట్లాడుతూ కోర్టుకు వచ్చే కక్షిదారుల సౌకర్యం కోసం ట్రస్ట్ చైర్మన్, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామిని కోరగా ఆయన స్పందించి 30 బెంచీలు ఇచ్చినట్టు తెలిపారు.
బార్ అససియేషన్ సభ్యులు వివేక్ వెంకటస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. నంది మేడారం జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకి ఇంకా ఎలాంటి సదుపాయాలు కావాలన్న వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకువెళ్ళి సమకూరుస్తామని ట్రస్ట్ సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు గడ్డం లింగారెడ్డి, ఈదుల ప్రదీప్ రెడ్డి, ఎంపెల్లి ప్రవీణ్, విశాఖ ట్రస్ట్ సభ్యులు ఎండీ హఫీజ్ పాల్గొన్నారు.