మాజీ సీఎం జగన్ లండన్ ప్రయాణానికి కోర్ట్ బ్రేక్

విజయవాడ:  అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల రాజీనామాలతో వరుస ఎదురుదెబ్బలు తింటున్న  వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్‎కు మరో అనుహ్యం పరిణామం ఎదురైంది. పాస్ పోర్టు ఇష్యూ వల్ల జగన్ లండన్ ప్రయాణానికి బ్రేక్ పడింది. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలుకావడంతో జగన్ సీఎం పదవి కోల్పోయారు. ముఖ్యమంత్రి పదవి పోవడంతో జగన్ డిప్లోమాట్ పాస్ పోర్టును అధికారులు రద్దు చేశారు. దీంతో జగన్ జనరల్ పాస్ట్ పోర్టు కోసం అప్లై చేసుకున్నారు. 

అయితే, జగన్‎కు కేవలం ఏడాది పరిమితితో మాత్రమే జనరల్ పాస్ పోర్టు ఇవ్వాలని విజయవాడ కోర్టు ఆదేశించింది. విజయవాడ కోర్టు ఆదేశాలను జగన్ హైకోర్టులో సవాల్ చేశారు. ఐదు సంవత్సరాల పాటు పాస్ పోర్టు అనుమతి ఇవ్వాలని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. పాస్ పోర్టు ఇష్యూ వల్ల జగన్ తన ఫారెన్ టూర్ ను పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఈ పిటిషన్పై తీర్పు వచ్చిన అనంతరం జగన్ విదేశాలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.