Delhi Liquor case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితులకు బెయిల్

Delhi Liquor case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితులకు బెయిల్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐదుగురు నిందితులకు బెయిల్ మంజూరయ్యింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్ట్  ముత్తా గౌతమ్, అరుణ్ రాంచంద్రన్, సమీర్ మహేంద్రు, కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్‌లకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన సమీర్ మహేంద్రు ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నాడు.

ఇదే కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ ఆదివారం అరెస్ట్ చేసింది. తన అరెస్ట్ పై ఇవాళ సుప్రీంను ఆశ్రయించిన సిసోడియాకు నిరాశే ఎదురైంది. ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసిన సుప్రీం.. ఢిల్లీ హైకోర్ట్ కు వెళ్లాలని సిసోడియాకు సూచించింది.