ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరుణ్ పిళ్లైకి బెయిల్

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త అరుణ్​ రామచంద్ర పిళ్లైకు రౌస్ ఎవెన్యూ కోర్టు రెండు వారాల బెయిలు మంజూరు చేసింది. భార్య అనారోగ్యం దృష్ట్యా 8 వారాలు బెయిల్ మంజూరు చేయాలని పిళ్లై దాఖలు చేసిన పిటిషన్ ను సోమవారం సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి జస్టిస్ ఎంకే నాగ్పాల్ విచారణ జరిపారు. పిళ్లై తరఫున న్యాయవాది నితీష్​ రాణా వాదనలు వినిపించారు. పిటిషనర్ భార్యకు శస్త్రచికిత్స కొనసాగుతోందని, హాస్పిటల్ లో ఆమెను చూసుకోవడానికి ఎవరూ లేరని వాదించారు. దీంతో హైకోర్టు.. పిళ్లైకు రెండు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.