వనపర్తి, వెలుగు: వనపర్తిలోని కాంపౌండ్ వాల్‌ను కూల్చివేసిన ఆఫీసర్ల తీరుపై యజమాని కోర్టును ఆశ్రయించడంతో, న్యాయమూర్తి ఆఫీసర్ల తీరును తప్పు పట్టారు. వనపర్తి పట్టణ పోలీసులు, మున్సిపల్ అధికారులు నిబంధనలకు నోటీసు ఇవ్వకుండా గోడను కూల్చారని, బండారు ఉదయ్, ఆయన కుటుంబీకులు కోర్టును ఆశ్రయించారు. పట్టణ శివారులోని సర్వే నెంబరు 1149/ఈ లోని 0.05 గుంటల భూమిలో బండారు ఉదయ్ , అతని కుటుంబసభ్యులు కాంపౌండ్‌వాల్ నిర్మించుకున్నారు. రాజకీయ ఒత్తిళ్లతో పట్టణ పోలీసుల బందోబస్తు నడుమ గోడను కూల్చారు.
అప్పటికే కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా బేఖాతరు చేశారు. కాంపౌండ్‌వాల్ నిర్మాణానికి రూ. 4 లక్షలు ఖర్చు చేశామని, ఆ డబ్బులు నష్టపోయామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సెక్షన్ 166, 427,447 కింద పోలీస్, మున్సిపల్ ఆఫీసర్లపై కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేసినట్లు బాధితుడు బండారు ఉదయ్ మీడియాకు తెలిపారు.