మేడిగడ్డ కుంగిన కేసులో..కేసీఆర్​కు కోర్టు నోటీసులు

మేడిగడ్డ కుంగిన కేసులో..కేసీఆర్​కు కోర్టు నోటీసులు
  •  వచ్చే నెల 5న హాజరవ్వాలని భూపాలపల్లి జిల్లా కోర్టు ఆదేశాలు
  • హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావుతో పాటు మరో ఆరుగురికి కూడా
  • నోటీసులు అందుకున్న వారిలో రజత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్మితా సభర్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ‘మేఘా’ కృష్ణారెడ్డి
  • వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని భూపాలపల్లి వాసి పిటిషన్​

జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు : లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్​లో జరిగిన అవినీతిపై విచారణ జరపాలంటూ దాఖలైన పిటిషన్​లో భాగంగా మాజీ సీఎం కేసీఆర్, అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్​రావుతో పాటు మరో ఆరుగురికి భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది.

కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ కుంగిపోవడం వల్ల వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని, నిర్మాణ సమయంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరపాలని కోరుతూ భూపాలపల్లికి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి జిల్లా కోర్టులో రివిజన్‌‌‌‌ పిటిషన్‌‌‌‌ వేశారు. ఈ కేసులో కేసీఆర్, హరీశ్‌‌రావుతో పాటు అప్పటి ఇరిగేషన్ సెక్రటరీ రజత్ కుమార్, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇరిగేషన్‌‌‌‌ ఇంజినీర్- ఇన్- చీఫ్ హరిరామ్, చీఫ్ ఇంజినీర్ శ్రీధర్, ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కించుకున్న ‘మేఘా’ నిర్మాణ సంస్థ అధినేత కృష్ణారెడ్డి, బ్యారేజీని నిర్మించిన ఎల్ అండ్ టీ చీఫ్‌‌‌‌ ఇంజినీర్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. వీరివల్ల వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైంద ని, విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరా రు. ఈ కేసును పరిగణనలోకి తీసుకున్న కోర్టు కేసీఆర్‌‌‌‌, హరీశ్‌‌‌‌తో పాటు మొత్తం 8 మందికి నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 5న జిల్లా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.

కేసు వివరాలివి

సుమారు రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ ప్రారంభించిన నాలుగేండ్లలో గతేడాది అక్టోబర్‌‌‌‌ 21వ తేదీన భూమిలోకి కుంగింది. దీంతో అప్పట్లోనే భూపాలపల్లికి చెందిన నాగవెళ్లి రాజలింగమూర్తి ఈ ఘటనపై పోలీసులకు కంప్లైంట్‌‌‌‌ ఇచ్చారు. ఇందుకు అప్పటి సీఎం కేసీఆర్‌‌‌‌, ఇరిగేషన్‌‌‌‌ మంత్రి హరీశ్‌‌‌‌రావుతో పాటు ఇరిగేషన్‌‌‌‌ శాఖకు చెందిన పలువురు ఇంజినీర్లు, సీనియర్‌‌‌‌ ఐఏఎస్‌‌‌‌లే కారణమంటూ పిటిషన్​లో ఆరోపించారు. 

ఈ ఘటనపై విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. కాగా, పోలీసులు ఈ పిటిషన్‌‌‌‌పై అప్పట్లో ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌ నమోదు చేయలేదు. పట్టువదలని రాజలింగమూర్తి భూపాలపల్లి ఎస్పీ, హైదరాబాద్‌‌‌‌లోని డీజీపీ ఆఫీసులో కూడా కంప్లైంట్‌‌‌‌ ఇచ్చినా పోలీస్‌‌‌‌ శాఖ పట్టించుకోలేదు. దీంతో రాజలింగమూర్తి భూపాలపల్లి జిల్లా కోర్టులో ప్రైవేట్‌‌‌‌ పిటిషన్‌‌‌‌ ఫైల్‌‌‌‌ చేశారు. సరైన ఆధారాలు లేవని అప్పట్లో జిల్లా కోర్టు ఈ పిటీషన్‌‌‌‌ను కొట్టేసింది. 

దీంతో రాజలింగమూర్తి హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు సూచనల మేరకు భూపాలపల్లి జిల్లా కోర్టులో మార్చి 2వ తేదీన మళ్లీ అన్ని ఆధారాలతో రివిజన్‌‌‌‌ పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. ప్రివెన్షన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ కరప్షన్‌‌‌‌ యాక్ట్‌‌‌‌ 1988, ఇండియన్‌‌‌‌ పీనల్‌‌‌‌ కోడ్‌‌‌‌ 1860 ప్రకారం పిటిషన్‌‌‌‌లో ప్రతివాదులుగా పేర్కొన్న వారందరిపై ఐపీసీ 120 బీ, 420, 386, 406, 409 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరపాలని జిల్లా కోర్టులో రివిజన్‌‌‌‌ పిటిషన్‌‌‌‌ వేశారు. 

లలిత కుమార్‌‌‌‌ వర్సెస్‌‌‌‌ ఉత్తర్‌‌‌‌ ప్రదేశ్‌‌‌‌ రాష్ట్ర ప్రభుత్వం మధ్య సుప్రీం కోర్టులో నడిచిన కేసును ఈ పిటిషన్‌‌‌‌లో కోట్ చేశారు. కాగా, వచ్చే నెల 5వ తేదీన జరగబోయే‌‌ విచారణకు మాజీ సీఎం కేసీఆర్‌‌, ఉన్నతాధికారులు కోర్టుకు హాజరవుతారా? లేదా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.