సీఎం జగన్ పై రాయి దాడి కేసులో జరుగుతున్న దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు విషయంలో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు సతీష్ అనే యువకుడే దాడికి పాల్పడినట్లుగా గుర్తించి A1గా పేర్కొన్నారు. సతీష్ కి సహకరించిన మరో వ్యక్తి దుర్గారావును A2గా పేర్కొన్నారు. సీఎం జగన్ ను హత్య చేసేందుకే దాడి చేసినట్లు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు పోలీసులు.
ప్రధాన నిందితుడు సతీష్ ని కోర్టు ఎదుట హాజరు పరచగా అతనికి 14రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది న్యాయస్థానం. సతీష్ ను నెల్లూరు జైలుకు తరలించారు పోలీసులు. రాయి విసిరాడన్న కారణంతో సతీష్ పై 307 కింద కేసు బుక్ చేయటాన్ని అతని తరపు లాయర్ తప్పుబట్టగా, హత్య చేయాలన్న కాంక్షతోనే రాయి విసిరాడంటూ ప్రభుత్వ లాయర్లు వినిపించిన వాదనలతో కోర్టు ఏకీభవించి రిమాండ్ కు ఆదేశాలిచ్చింది.