అత్యాచారం కేసులో పలువురు మహిళలపై లైంగిక దాడి వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను బెంగళూరులోని ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ప్రజ్వల్ తరుపున న్యాయవాది అరుణ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది .ఈ పిటిషన్లపై అభ్యంతరాలను దాఖలు చేయాలని కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ను కోర్టు కోరింది. కాగా ప్రజ్వల్ని బెంగళూరు విమానాశ్రయానికి రాగానే అరెస్టు చేస్తామని కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర తెలిపారు. . జర్మనీలోని మ్యూనిచ్ నుంచి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్న ప్రజ్వల్ శుక్రవారం తెల్లవారుజామున బెంగళూరుకు చేరుకుంటారు. ప్రజ్వల్‌పై ఇప్పటి వరకు రెండు లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. ప్రజ్వల్ రేవణ్ణపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై సిట్ విచారణ జరుపుతోంది.
Also read : ప్రభుత్వం ఉన్నట్టా? లేనట్టా? : మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్