2019 సెక్స్ ట్రాఫికింగ్​లో..బిల్​ క్లింటన్, ట్రంప్ పేర్లు!

  • కేసుకు సంబంధించి 40 డాక్యుమెంట్లు రిలీజ్    
  • మైఖేల్ జాక్సన్, సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్ పేర్ల ప్రస్తావన
  • డాక్యుమెంట్లలో ఎపిస్టన్ బాధితురాలి స్టేట్​మెంట్లు

న్యూయార్క్ :  అమెరికాలో 2019లో సెక్స్ ట్రాఫికింగ్​కు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకునేందుకు జెఫ్రీ ఎపిస్టన్ అనే వ్యక్తి ప్రముఖులకు అమ్మాయిలను ఎరగా వేసినట్లు తాజాగా బయటికొచ్చిన 40 డాక్యుమెంట్ల ద్వారా తెలిసింది. జెఫ్రీ ఎపిస్టన్ చేతిలో లైంగిక హింసకు గురైన ఓ అమ్మాయి 2019లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో లైంగిక నేరాలు, సెక్స్ ట్రాఫికింగ్​కు పాల్పడిన ఎపిస్టన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారిస్తున్న టైమ్​లో అనుమానాస్పదంగా చనిపోయాడు. ఎపిస్టన్ ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. తాజాగా బయటికొచ్చిన 40 డాక్యుమెంట్లలో ఎపిస్టన్​తో సన్నిహితంగా మెలిగిన వారి పేర్లు ఉన్నాయి. ఆ జాబితాలో ఇద్దరు అమెరికా మాజీ అధ్యక్షులు, పాప్​ సింగర్ మైఖేల్ జాక్సన్‌‌‌‌, స్టీఫెన్ హాకింగ్​తో పాటు పలువురు వ్యాపారులు, ప్రముఖులు పేర్లున్నాయి.

17 ఏండ్ల అమ్మాయితో ప్రిన్స్ ఆండ్రూ సెక్స్

జెఫ్రీ.. తన ప్రైవేటు బోయింగ్‌‌‌‌ 747 విమానంలో కొద్ది మంది సన్నిహితులతో కలిసి విదేశాలకు వెళ్లేవాడు. ఈ విమానాన్ని ‘లోలితా ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌’గా పిలిచేవారు. ఈ ఫ్లైట్​లోనే యువతులు, బాలికలను తీసుకెళ్లేవాడని చెప్తున్నారు. అయితే, సెక్స్ ట్రాఫికింగ్ కేసు బాధితులు.. క్లింటన్‌‌‌‌పై ఎలాంటి ఆరోపణలు చేయనప్పటికీ.. ప్రిన్స్ ఆండ్రూ మాత్రం ఓ 17 ఏండ్ల అమ్మాయితో సెక్స్​ చేసినట్టు ఆరోపించారు. ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ పేరు సెక్స్ స్కాండల్​లో వినిపిస్తున్నది.

జెఫ్రీ విమానంలో బిల్ క్లింటన్ జర్నీ

అధ్యక్ష పదవి కాలం తర్వాత బిల్ క్లింటన్ పారిస్, బ్యాంకాక్, బ్రూనై వెళ్లారు. అప్పుడు జెఫ్రి విమానాన్నే తీసుకెళ్లినట్లు ఫ్లైట్ రికార్డులు కూడా  చెప్తున్నాయని డాక్యుమెంట్లలో స్పష్టంగా ఉంది. ఎపిస్టన్ చేతిలో బాధించబడిన మరో అమ్మాయి జోహన్నా స్జోబెర్గ్ బిల్ క్లింటన్​పై ఆరోపణలు చేసింది. చిన్న వయస్సు అమ్మాయిలంటే బిల్ క్లింటన్​ ఇష్టపడ్తారని స్జోబెర్గ్ వివరించింది.

క్లింటన్ పేరు 50 మార్లు..

ట్రాఫికింగ్​లో జెఫ్రీకి ఆయన ప్రియురాలు ఘిస్లైన్ మాక్స్​వెల్ సాయంచేసేదని వర్జీనియా కు చెందిన బాధితురాలు గియుఫ్రే స్టేట్​మెంట్ ద్వారా తెలుస్తోంది. 1999 నుంచి 2002 మధ్య తనను జెఫ్రీ లైంగికంగా వేధించినట్లు గియుఫ్రే పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి న మొత్తం డాక్యుమెంట్లను పోలీసులు కోర్టు లో సబ్మిట్ చేశారు. ఇందులో బిల్ క్లింటన్ ను డో 36గా వ్యవహరించారు. ఈ పేరు 50 సార్లు ప్రస్తావించారు. క్లింటన్​పై గియుఫ్రే ఎలాంటి ఆరోపణలు చేయనప్పటికీ.. జెఫ్రీ ఇంట్లో ఇద్దరు యువతులతో క్లింటన్​ను చూశానని చెప్పింది. దీనిపై స్పందించిన క్లింటన్..  తాను ఎప్పుడూ అక్కడికి వెళ్లలేదని చెప్పారు.