పూజా ఖేద్కర్ ఫేక్ సర్టిఫికేట్ కేసులో.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి IAS కొలువు సంపాధించిన పూజా ఖేద్కర్ ను ఢిల్లీ హైకోర్టులో ఉపశమనం కలిగింది. మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌ అరెస్ట్ ను ఆగస్టు 21 వరకు వాయిదా వేసింది. తదుపరి విచారణ తేదీ వరకు ఆమెను కస్టడీలోకి తీసుకోవద్దని ఢిల్లీ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ కి చేసిన దరఖాస్తులో ఖేద్కర్ ఫేక్ సర్టిఫికేట్ సమర్పించిందని ఆరోపణలు ఉన్నాయి. ముందస్తు బెయిల్‌ కోసం పూజ ఖేద్కర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్‌ సుబ్రమణియం ప్రసాద్‌ ఈ ఆదేశాలు జారీ చేశారు. 

విచారణకు సహకరించాలని ఖేద్కర్‌ను కోర్టు ఆదేశించింది. ఖేద్కర్ 2023-బ్యాచ్ IAS అధికారి పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఫోటో, సంతకం, ఇమెయిల్ ID, మొబైల్ నంబర్, చిరునామాతో సహా ఆమె గుర్తింపు అన్నీ తప్పు సమాచారం ఇచ్చిందని UPSC ఆమెపై పోలీసు కేసు నమోదు చేసింది. జూలై 31న పూజా ఖేద్కర్ ట్రైనీ యూపీఎస్సీ అభ్యర్థిత్వాన్ని రద్దు చేశారు.