గండిపేట, వెలుగు: వ్యక్తి హత్య కేసులో రౌడీషీటర్‌కు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. అత్తాపూర్ పరిధిలోని చింతల్ మెట్ ఇమామ్ దర్గాలో 2014లో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో బాలాపూర్ కు చెందిన ఉస్మాన్ హుస్సేన్(34)ను నిందితుడిగా గుర్తించి, పోలీసులు పూర్తి ఆధారాలు సేకరించారు.
ఎల్‌బీ నగర్‌లోని 4వ ఏడీజే కోర్టులో ఇన్నాళ్లు కేసు విచారణ కొనసాగగా, న్యాయమూర్తి డాక్టర్ జె.కవిత నిందితుడిని దోషిగా తేల్చి బుధవారం జీవిత ఖైదుతోపాటు రూ.వెయ్యి జరిమానా విధించారు.