![కానిస్టేబుల్స్‌పై దాడి.. నిందితుడికి జీవిత ఖైదు](https://static.v6velugu.com/uploads/2025/02/court-sentences-accused-to-life-imprisonment-in-attack-on-constables-case_cjWmBtXwMa.jpg)
గచ్చిబౌలి, వెలుగు : మర్డర్ కేసులో తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని పట్టుకునేందుకు వెళ్లిన కానిస్టేబుళ్లపై దాడి చేసిన కేసులో నిందితునికి జీవిత కాల శిక్ష పడింది. సైబరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో 2023 జనవరి లో జరిగిన ఓ మర్డర్ కేసులో నిందితుడుగా ఉన్న కరణ్‌సింగ్ ఎల్లమ్మబండలోని సిక్కు బస్తీలో ఉన్నాడని సమాచారం వచ్చింది. అతన్ని అదుపులోకి తీసుకునేందుకు కానిస్టేబుల్స్ రాజునాయక్, విజయ్ వెళ్లారు.
దీంతో కరణ్‌సింగ్ ఈ ఇద్దరిపై కత్తితో దాడి చేశాడు. కానిస్టేబుల్స్ఫిర్యాదుతో జగద్గిరిగుట్ట పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. అదే రోజు రాత్రి11.45 గంటలకు జగద్గిరిగుట్ట పోలీసులు కరణ్‌సింగ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో పోలీసులు చార్జ్‌షీట్ ఫైల్ చేయగా, మంగళవారం నిందితునికి జీవిత కాలం జైలు శిక్ష, రూ.15వేల ఫైన్ విధిస్తూ తీర్పు వెల్లడించారు.